- Home
- Sports
- Cricket
- మళ్లీ అతనే! టీమిండియా ఫ్యాన్స్‌ని భయపెడుతున్న అంపైర్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కూడా... అతనున్న ప్రతీ మ్యాచ్‌లో..
మళ్లీ అతనే! టీమిండియా ఫ్యాన్స్‌ని భయపెడుతున్న అంపైర్, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి కూడా... అతనున్న ప్రతీ మ్యాచ్‌లో..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ అంపైర్లను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. అయితే ఇందులో ఉన్న ఓ అంపైర్ పేరు, టీమిండియా ఫ్యాన్స్‌ని తెగ భయపెడుతోంది.. అదే రిచర్డ్ కెటిల్‌బరో...
- FB
- TW
- Linkdin
Follow Us
)
జూన్ 7నుంచి లండన్‌లోని ఓవల్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి న్యూజిలాండ్ అంపైర్ క్రిస్ గఫనీ, ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఆన్- ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు...
Richard Kettleborough
అలాగే ఇంగ్లాండ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా, శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. వెస్టిండీస్ దిగ్గజం రిచీ రిచర్డ్‌సన్ మ్యాచ్ రిఫరీగా ఉంటాడని ఐసీసీ ప్రకటించింది...
ఇందులో టీమిండియాని భయపెడుతున్న పేరు రిచర్డ్ కెటిల్‌బరో. 2014 నుంచి రిచర్డ్ కెటిల్‌బరో, అంపైర్‌గా వ్యవహరించిన ప్రతీ మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి పాలైంది..
2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి అంపైర్‌గా వ్యవహరించాడు రిచర్డ్ కెటిల్‌బరో. ఈ మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు. ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది..
2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా 328 పరుగుల భారీ స్కోరు చేయగా టీమిండియా 233 పరుగులకే ఆలౌట్ అయ్యి చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌కి కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నాడు...
rohit out
2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ రిచర్డే అంపైర్. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటం కారణంగా టీమిండియా 192 పరుగుల భారీ స్కోరు చేసినా వెస్టిండీస్ మరో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది..
rohit sharma
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కూడా రిచర్డ్ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నాడు. టీమిండియా ఫ్యాన్స్‌కి ఈ మ్యాచ్ ఓ పీడకల. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లోనూ రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్...
ఎమ్మెస్ ధోనీ రనౌట్ అయిన తర్వాత రిచర్డ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ టీమిండియా ఫ్యాన్స్‌కి గుర్తుండిపోయి ఉంటుంది. అంతేకాదు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కి, 2021 టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కి కూడా రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నాడు...
రిచర్డ్ కెటిల్‌బరో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్నా, టీవీ అంపైర్‌గా ఉన్నా ఆ మ్యాచ్‌లో టీమిండియాకి ఓటమి తప్పలేదు. దీంతో భారత జట్టుకి బ్యాడ్ లక్‌గా మారిన రిచర్డ్ కెటిల్‌బరో మరోసారి ఐసీసీ ఈవెంట్‌లో కనిపించబోతుండడంతో రిజల్ట్ ఏ విధంగా వస్తుందోనని భయపడుతున్నారు ఫ్యాన్స్..