- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ, నాతో కలిసి సౌతాఫ్రికాకి ఆడితే బాగుండేది... ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్...
విరాట్ కోహ్లీ, నాతో కలిసి సౌతాఫ్రికాకి ఆడితే బాగుండేది... ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్...
రాజకీయాల్లోనే కాదు, క్రికెట్‌లో ఆప్తమిత్రులు, బద్ధశత్రువులు ఉండరు. అయితే విరాట్ కోహ్లీ- ఏబీ డివిల్లియర్స్ వంటి కొందరు మాత్రం దీనికి మినహాయింపు... ఈ ఇద్దరు స్నేహం గురించి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ సుపరిచితమే...

‘ఐపీఎల్‌లో ఆర్‌సీబీలోకి రాకముందు నా గురించి, తనకీ... విరాట్ గురించి నాకు తెలుసు. ఇరుదేశాల మధ్య మ్యాచులు జరిగేటప్పుడు కలిసిన సందర్భాలు ఉన్నాయి..
ఐపీఎల్‌లోకి వచ్చిన ఆరంభంతో అతని కెప్టెన్సీ, యాటిట్యూడ్ చూసి, వీడేంటి మొండోడిలా ఉన్నాడు, ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటని అనుకున్నా...
విరాట్ కోహ్లీపై నా మొదటి ఇంప్రెషన్ అదే. అయితే రానురానూ మా మధ్య అనుబంధం పెరుగుతూ వచ్చింది. అతను క్రికెట్ ప్రపంచంలోనే తిరుగులేని స్టార్ అయ్యాడు...
ఏళ్లు గడిచే కొద్దీ తనలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ పోయింది. అయినా ఎప్పుడూ ఎవ్వరూ చులకన చేసి మాట్లాడడం చూడలేదు. అందరినీ గౌరవించి మాట్లాడేవాడు...
విరాట్ కోహ్లీ గురించి నేను ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఎందుకంటే అతనిలో నాకు ఏ తప్పు కనిపించలేదు. దాదాపు 11 ఏళ్ల కిందట 2011లో మేం స్నేహితులం అయ్యాం...
నిజానికి నేను ఎవ్వరితోనూ ఎక్కువ రోజులు స్నేహం చేయను. ఎక్కువగా ఏ స్నేహితుడితోనూ విషయాలను పంచుకోవడానికి ఇష్టపడను. కానీ విరాట్ దీనికి మినహాయింపు...
విరాట్ కోహ్లీతో ఆడడం మొదలెట్టిన తర్వాత అతను సౌతాఫ్రికాకి ఆడితే బాగుండు అనిపించింది. అప్పుడైతే ఎక్కువ రోజులు కలిసి ఆడొచ్చు, ఎక్కువ సేపు అతనితో కలిసి ఉండొచ్చు కదా...
సంవత్సరంలో మేం కలిసేది రెండు నెలలే అయినా, అతను తరుచూ నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటాడు... మా ఇద్దరి ఆట ఒకేలా ఉంటుంది...
అతను చివరి దాకా ఓటమిని అంగీకరించడు. నేను కూడా అంతే. అందుకేనేమో మేం ఇద్దరం మంచి స్నేహితులుగా మారిపోయాం...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్...
2021 ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్. అయితే ఈ ఏడాది ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్‌లో ఏబీడీ ఉంటాడని ప్రచారం జరుగుతోంది...