- Home
- Sports
- Cricket
- ఆ భారత క్రికెటర్‌ని కొట్టాలనుకున్నా... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ కామెంట్స్...
ఆ భారత క్రికెటర్‌ని కొట్టాలనుకున్నా... లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ కామెంట్స్...
రిటైర్ అయిన లెజెండరీ క్రికెటర్లు అందరూ కలిసి ఆడుతున్న లీగ్ ‘లెజెండ్స్ లీగ్ క్రికెట్’. ఇండియా మహారాజాస్, ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ పేర్లతో మూడు టీమ్స్‌గా మాజీ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నారు...

ఇండియా మహరాజాస్, ఆసియా లయన్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్ల జట్లు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది...
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఉపుల్ తరంగ 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేయగా మిస్బా వుల్ హక్ 30 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు...
మన్‌ప్రీత్ గోనీ 3 వికెట్లు తీయగా ఇర్ఫాన్ పఠాన్ 2 వికెట్లు తీశాడు. స్టువర్ట్ బిన్నీ, మునాఫ్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది...
19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది ఇండియా మహారాజాస్ జట్టు. నామన్ ఓజా 19 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా స్టువర్ట్ బిన్నీ 10, బద్రీనాథ్ డకౌట్ అయ్యారు...
యూసఫ్ పఠాన్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి రనౌట్ కాగా మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ కలిసి మ్యాచ్‌ని ముగించారు...
మహ్మద్ కైఫ్ 37 బంతుల్లో 2 ఫోర్లతో 42 పరుగులు చేయగా ఇర్ఫాన్ పఠాన్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో ముచ్చటించిన ఆసియా లయన్స్ బౌలర్, పాక్ మాజీ క్రికెటర్... ‘నాకు మహ్మద్ కైఫ్‌ని కొట్టాలని ఉంది...’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు...
‘నేను మ్యాచ్ ప్రారంభానికి ముందే నా బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి బ్యాటింగ్ చేయొద్దని చెప్పా. అయినా మహ్మద్ కైఫ్ నా మాటలు వినలేదు. అందుకే నాకు చాలా కోపం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...