భారత్ సరైన పిచ్ లు తయారుచేస్తే సిరీస్ విజేత ఆస్ట్రేలియానే : ఇయాన్ హీలి
Border Gavaskar Trophy: భారత్ తో నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు గాను ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు బుధవారమే భారత్ కు చేరుకుంది. బెంగళూరులో ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నది.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడేందుకు గాను ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు బుధవారమే భారత్ కు చేరుకుంది. బెంగళూరులో ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొంటున్నది. 19 ఏండ్లుగా భారత్ లో భారత్ ను ఓడించాలని తాపత్రయపడుతున్న ఆసీస్..ఈ సారి మాత్రం పక్కా ప్లానింగ్ తో ఉపఖండంలో అడుగుపెట్టింది.
అయితే ఇక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహజంగానే భారత్ లోని పిచ్ లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి స్పిన్ పిచ్ లను తయారుచేయకున్నా బంతి టర్న్ అవుతుంది. కానీ ఆసీస్ మాజీలు మాత్రం భారత్ కావాలనే స్పిన్ పిచ్ లను తయారుచేస్తుందని తద్వారా లాభం పొందాలని చూస్తుందని వాపోతున్నారు.
తాజాగా ఆ జట్టు దిగ్గజ ఆటగాడు ఇయాన్ హీలి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. సరైన పిచ్ లను రూపొందిస్తే మాత్రం భారత్ లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంటుందని చెప్పాడు.
ఈనెల 9న నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కాబోతున్న తొలి టెస్టుకు ముందు హీలి మాట్లాడుతూ... ‘ఒకవేళ భారత్ పిచ్ లు రెండు జట్లకూ సహకారం అందించే విధంగా ఉంటే అప్పుడు ఆస్ట్రేలియా గెలుస్తుంది. పిచ్ లు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూ అనుకూలంగా ఉండాలి. అటు పేస్ తో పాటు ఇటు స్పిన్ కు అనుకూలించేలా వాటిని రూపొందించాలి.
అయితే నాకున్న ఒకే ఒక సందేహం మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ గురించే.. గత సిరీస్ (2017లో) సరైన పిచ్ లు లేకపోవడంతో వీళ్లు ఫెయిల్ అయ్యారు. తొలి రోజు నుంచే బంతిని బౌన్స్ అయ్యేలా రూపొందిస్తే అది భారత్ కు లాభిస్తుంది. స్వదేంలో ఆ పరిస్థితులను భారత్ చక్కగా వినియోగించుకుంటుంది...’అని చెప్పాడు.
ఆసీస్ లో పది వికెట్లను పడగొట్టడానికి ఎక్కువ అవకాశాలుంటాయని, కానీ భారత్ లో మాత్రం పది అవకాశాలే ఉంటాయని.. హీలి అన్నాడు. ఆసీస్ లో కొన్ని ఛాన్సులు మిస్ అయినా నష్టం లేదని కానీ భారత్ లో మాత్రం అలాంటి అవకాశాలను మిస్ చేసుకోవద్దని కమిన్స్ సేనకు సూచించాడు. స్వదేశంలో ఎంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉన్నా భారత ఆటగాళ్లు తట్టుకుని నిలబడతారని ఆసీస్ ఆటగాళ్లు కూడా వాటిని అలవరుచుకోవాలని సలహా ఇచ్చాడు.