MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • నా రోల్ మోడల్ అతడే.. టీవీలో ఆ షాట్లు చూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడిని : బాబర్ ఆజమ్

నా రోల్ మోడల్ అతడే.. టీవీలో ఆ షాట్లు చూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవాడిని : బాబర్ ఆజమ్

PAK vs ENG: బాబర్ ఆజమ్ కు ఫేవరేట్ క్రికెటర్ ఎవరు.? అతడు ఎవరి బ్యాటింగ్ ను బాగా ఇష్టపడతాడు..? అనే ప్రశ్న పాకిస్తానీయులతో పాటు బాబర్  బ్యాటింగ్ ను ఆస్వాదించే అభిమానులు కూడా తరుచూ అడుగుతుంటారు. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 01 2022, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్ తర్వాత అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో  అగ్రస్థానంలో ఉండే ఆటగాడు పాకిస్తాన్ సారథి  బాబర్ ఆజమ్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా  అత్యుత్తమ ప్రదర్శనలు చేస్తున్న బాబర్ బ్యాటింగ్ పై  ప్రపంచ క్రికెట్ పండితులు  ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే మరి బాబర్ ఆజమ్ కు ఫేవరేట్ క్రికెటర్ ఎవరు.?? అతడు ఎవరి బ్యాటింగ్ ను బాగా ఇష్టపడతాడు..? అనే ప్రశ్న పాకిస్తానీయులతో పాటు బాబర్  బ్యాటింగ్ ను ఆస్వాదించే అభిమానులు కూడా తరుచూ అడుగుతుంటారు. ఈ ప్రశ్నకు తాజాగా బాబర్  సమాధానం చెప్పాడు. 

37

ఇంగ్లాండ్ - పాకిస్తాన్  టెస్టు సిరీస్ కు ముందు ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి నాసిర్ హుస్సేన్ తో  బాబర్ ముచ్చటించాడు. ఈ సందర్భంగా నాసిర్ కూడా ఇదే ప్రశ్న అడిగాడు. దీనికి బాబర్ మాట్లాడుతూ.. ‘నా రోల్ మోడల్ సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్. అతడి ఆట అంటే నాకు పిచ్చి.. 

47
AB de Villiers

AB de Villiers

సౌతాఫ్రికా మ్యాచ్ ఉండి ఆ మ్యాచ్ లో ఏబీడీ ఆడుతున్నాడంటే నేను  టీవీ ముందు నుంచి కదలకపోయేవాడిని.  ఏబీడీ ఆడిన షాట్లను నేను మరుసటి రోజు నెట్స్ లో ప్రాక్టీస్ చేసేవాడిని.  డివిలియర్స్ నా ఆరాధ్య దైవం..’ అని అన్నాడు. 

57

ఇక ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కోసం తాను ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రతీ ఒక్కరూ మంచి క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నానని  చెప్పాడు. 17 ఏండ్ల తర్వాత ఇంగ్లాండ్ పాక్ కు రావడం  చాలా సంతోషంగా ఉందని,   ఈ మేరకు ఇంగ్లీష్ జట్టుకు ఘన స్వాగతం పలుకుతున్నామని తెలిపాడు. 

67

కాగా రావల్పిండి వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ - పాకిస్తాన్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న ఇంగ్లాండ్ ఇరగదీస్తున్నది.  లంచ్ సమయానికే ఇంగ్లీష్ ఓపెనర్లు    సెంచరీల ముంగిట నిలిచారు.  ఓపెనర్ జాక్ క్రాలే (91 నాటౌట్), బెన్ డెకట్ (77 నాటౌట్)లు  పాక్ బౌలింగ్ ను చీల్చి చెండాడుతున్నారు.  

77

నసీమ్ షా,  మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్ముద్, అఘా సల్మాన్.. ఇలా బైర్లు మారుతున్నా పాక్ కు వికెట్లైతే దక్కడం లేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. 27 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్.. వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చసింది.  ఇప్పటికే రన్ రేట్ 6 దాటడం గమనార్హం. 
 

About the Author

SM
Srinivas M
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved