- Home
- Sports
- Cricket
- చిన్నప్పుడు ఆయనది బాగా చూసేదాన్ని.. మధ్యలో మానేశా.. కానీ మళ్లీ చూస్తా: కొత్త కోచ్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్
చిన్నప్పుడు ఆయనది బాగా చూసేదాన్ని.. మధ్యలో మానేశా.. కానీ మళ్లీ చూస్తా: కొత్త కోచ్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్స్
Rahul Dravid: సుదీర్ఘ కాలం భారత క్రికెట్ కు సేవలందించిన రాహుల్ ద్రావిడ్.. రిటైర్మెంట్ తర్వాత చాలా కాలానికి తిరిగి జట్టుకు కోచ్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ఆయన తన ఫస్ట్ లవ్ అని, ద్రావిడ్ తిరిగి భారత జట్టు తో చేరడంతో తిరిగి క్రికెట్ చూస్తానని ప్రముఖ బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా వ్యాఖ్యానించింది.

టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నైంటీస్ కిడ్స్ గా పిలుచుకునే చాలా మందికి క్రీజులో ద్రావిడ్ ఉన్నాడంటే ఇండియా మ్యాచ్ ఓడదు అనే ధీమా ఉండేది. తన క్లాస్ ఆటతో ఆడ, మగ తేడా లేకుండా ద్రావిడ్ కు అభిమానులు ఉండేవాళ్లు.
అయితే ఈ కోవలో ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్దా కూడా తానూ టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కు పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. తాను చిన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ ఆడుతుంటే టీవీ వదిలి వెళ్లేదాన్ని కాదని, అతడే తన ఫస్ట్ లవ్ అని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ద్రావిడ్ గురించి ఆమె మాట్లాడింది.
రిచా మాట్లాడుతూ.. ‘నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే చాలా అభిమానం ఉండేది. నా తమ్ముడు క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే నేను కూడా టీవీలకు అతుక్కుపోయేదాన్ని..
రాహుల్ ద్రావిడ్ ఆటను చూడటమంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆయన నా ఫస్ట్ లవ్. కానీ ఆయన రిటైర్మెంట్ కు దగ్గరవుతున్న కొద్దీ నేను క్రికెట్ చూడటం మానేశాను. నేనెంతగానో ఆరాదించే ద్రావిడ్ ఆటకు దూరమవ్వడంతో నేను కూడా ఆయన లేని ఆటను చూడలేకపోయాను..’ అని తెలిపింది.
భారత క్రికెట్ లో ‘ది వాల్’గా గుర్తింపు పొందిన ద్రావిడ్.. 2011లో వన్డే లకు గుడ్ బై చెప్పాడు. ఇక 2012 లో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆ తర్వాత కొన్నాళ్ల పాటు విరామం తీసుకున్న ద్రావిడ్.. మళ్లీ టీమిండియాకు సేవలందించడం మొదలుపెట్టాడు. యువ క్రికెటర్లకు శిక్షణనిచ్చే బాధ్యతను తీసుకున్న ద్రావిడ్.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ (ఎన్సీఏ)కు చీఫ్ గా నియమితుడయ్యాడు. అనంతరం ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గా వచ్చాడు.
తన తొలి సవాల్ నే రాహుల్ ద్రావిడ్ ఘనంగా అధిగమించాడు. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ కలిగిన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా మూడు టీ20 లు ఆడగా.. క్లీన్ స్వీప్ చేసింది. కొత్త కోచ్ రోహిత్ శర్మ సారథ్యంలో ద్రావిడ్ మార్గనిర్దేశకత్వంలో యువ భారత్ అదరగొట్టింది.
అయితే ద్రావిడ్ మళ్లీ భారత డ్రెస్సింగ్ రూమ్ కు రావడంతో తాను మళ్లీ క్రికెట్ చూస్తానని రిచా చద్దా తెలిపింది. ఇన్నాళ్లు ద్రావిడ్ లేని ఆటను ఆస్వాదించని ఆమె..ఇకపై మళ్లీ ఆటను ఫాలో అవుతానని చెప్పింది.
‘రాహుల్ ద్రావిడ్ ఇప్పుడు మళ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో సందడి చేస్తున్నాడు కాబట్టి.. నేను ఇకనుంచి క్రికెట్ చూడటం ప్రారంభిస్తా..’నని తెలిపింది.
బాలీవుడ్ లో కల్ట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిచా చద్దా.. 2008లో హిందీలో విడుదలైన ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ సినిమా ద్వారా పరిచయమైంది. ఇక 2012లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
ఆ తర్వాత ఫర్కీ, రామ్ లీలా, చాక్ అండ్ డస్టర్, ఇన్సైడ్ ఎడ్జ్, ఫర్కీ రిటర్న్స్, సెక్షన్ 370లతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక మీర్జాపూర్ సిరీస్ తో గుర్తింపు పొందిన అలీ ఫైజల్ తో ఆమె డేటింగ్ చేస్తున్నది. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం.