- Home
- Sports
- Cricket
- నా వల్లే ఇమ్రాన్ ఖాన్, ప్రధాని అయ్యాడు! కానీ వాడికి కృతజ్ఞత లేదు... - పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్
నా వల్లే ఇమ్రాన్ ఖాన్, ప్రధాని అయ్యాడు! కానీ వాడికి కృతజ్ఞత లేదు... - పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ముందు నుంచీ కాస్త తేడానే... ఆసియా కప్ కోసం పాకిస్తాన్‌కి రాకపోతే, భారత జట్టు నరకానికి పోతుందని శాపనార్థాలు పెట్టిన మియాందాద్, తాజాగా పాక్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

టాస్ గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఏం చేయాలో నిర్ణయం తీసుకుని వచ్చి చెబుతానని కామెంట్ చేసిన జావెద్ మియాందాద్ పాత వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది...
Javed Miandad
1992 వన్డే వరల్డ్ కప్ గెలిచిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో ఆడిన జావెద్ మియాందాద్, కొన్ని మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. రాజకీయాల తర్వాత ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ తెహ్రాక్ ఈ ఇన్సాఫ్ పార్టీని స్థాపించి, ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు..
‘ఇమ్రాన్ ఖాన్‌ని పాకిస్తాన్ ప్రధానిగా చేసింది నేనే. నా వల్లే అతను రాజకీయంగా కూడా సక్సెస్ అయ్యాడు. అయితే అతనికి ఏ మాత్రం కృతజ్ఞత లేదు. కనీసం నా గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. థ్యాంక్స్ కూడా చెప్పలేదు...’ అంటూ వ్యాఖ్యానించాడు జావెద్ మియాందాద్..
జావెద్ మియాందాద్ తమ్ముడు అన్వర్ మియాందాద్ కూడా పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్‌లో రాణించాడు. అలాగే సోహైల్ మియాందాద్, బషీర్ మియాందాద్, మేనల్లుడు ఫైసల్ ఇక్బాల్ కూడా క్రికెట్ ఆడారు..
‘నేను, మా తమ్ముళ్లు అందరం కలిసి వీధుల్లో క్రికెట్ ఆడేవాళ్లం. రాత్రి వేళల్లో ఇంటిపైన క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేసేవాళ్లం. నేను ఎప్పుడూ విజయం కోసమే ఆడేవాడేవి. పాక్ టీమ్ ఓడిపోయే పొజిషన్‌లో ఉంటే నా వల్ల ఆ ఓటమి తేడా ఎంత తగ్గించగలనో ఆలోచించేవాడిని..
ఓడిపోయినా పర్లేదు కానీ పోరాడి ఓడాలి. ఎంత తక్కువ తేడాతో ఓడిపోతే, అంత ఎక్కువగా పోరాడినట్టు అని టీమ్ ప్లేయర్లకు చెప్పేవాడిని. ఈ ఫార్ములా చాలా సక్సెస్ అయ్యింది.. నా కెప్టెన్సీలో ఎవ్వరూ నాకు ఎదురుచెప్పేవాళ్లు కాదు..’ అంటూ కామెంట్ చేశాడు జావెద్ మియాందాద్..