- Home
- Sports
- Cricket
- క్రిస్ గేల్ వంటి హిట్టర్లకే తప్పలేదు.. నన్నెవరు అడిగారు..? రూ. 15 కోట్ల ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు
క్రిస్ గేల్ వంటి హిట్టర్లకే తప్పలేదు.. నన్నెవరు అడిగారు..? రూ. 15 కోట్ల ఆటగాడి ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2022: ఐపీఎల్-15 సీజన్ లో అందరి అంచనాలను తలకిందులు చేస్తే ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త ఆటతో పది పరాజయాలు నమోదు చేసింది. అయితే ఆ జట్టు ఎంతో ముచ్చటపడి దక్కించుకున్న ఏ ఒక్క ఆటగాడు కూడా రాణించలేదు.

ఐపీఎల్-2022 లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసిరాలేదు. వాళ్లు ఆడిన 13 మ్యాచులలో 10 మ్యాచులు ఓడారు. మూడు మాత్రమే నెగ్గారు.అయితే ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు రూ. 15.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఇషాన్ కిషన్ కూడా ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
ఈ సీజన్ లో 13 మ్యాచులాడిన కిషన్.. 30.83 సగటుతో 370 పరుగులు చేశాడు. గడిచిన రెండు సీజన్లలో ముంబై తరఫున బాగా ఆడిన కిషన్ ను ఈసారి భారీ ధరకు కొన్న ముంబై.. అదే జోరును ఈ సీజన్ లో కూడా కొనసాగిస్తాడని ఆశించింది.
అయితే తన ఫామ్ పై వస్తున్న విమర్శల గురించి కిషన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో లెజెండ్స్ గా పేరున్న క్రిస్ గేల్ వంటి హిట్టర్లకు కూడా ముందు ఇలాంటి వైఫల్యాలు తప్పలేదని.. తాను అంతకన్నా గొప్పవాడిని కాదంటూ వ్యాఖ్యానించాడు.
కిషన్ మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో గొప్ప ఆటగాళ్లు అని పేరున్న చాలా మంది తొలుత స్ట్రగుల్ అయ్యారు. ప్రపంచంలో ఏ బౌలర్ నైనా అలవోకగా ఎదురుకునే క్రిస్ గేల్ కూడా కొత్తలో ఇబ్బందులు పడటాన్ని కూడా మనం చూశాం...
ప్రతి రోజు కొత్త రోజే. ప్రతి మ్యాచ్ మాకు కొత్త మ్యాచ్ తోనే సమానం. కొన్నిసార్లు మీరు బాగా ఆడొచ్చు. కొన్నిసార్లు విఫలం కావొచ్చు. మనం మన బ్యాటింగ్ గురించి ఎంత బాగా ప్రిపేర్ అయి వచ్చినా ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పుడు మనం ఎలా పడితే అలా ఆడితే కుదరదు.
మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మన ఆటతీరు మార్చుకోవాలి. నన్ను పంపించేది బాదడానికి మాత్రమే కాదుగా. క్రికెట్ లో ఎప్పుడు కూడా ఒక ఆటగాడి మీద ఒకే బాధ్యత ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి. అవతల ఎండ్ లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పుడు మనం ఇష్టమొచ్చినప్పుడు హిట్టింగ్ కు దిగుతామంటే కుదరదు.
ఆ సమయంలో వికెట్ కాపాడుకోవాలి. మ్యాచ్ ను రక్షించుకోవాలి. తర్వాత వచ్చే బ్యాటర్లకు దారి చూపాలి. ఇక మీరు చేజింగ్ లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. ప్రత్యర్థి బౌలర్ల బలాన్ని అంచనా వేసి అప్పుడు అందుకు తగ్గట్టుగా ఆడాలి..’ అని అన్నాడు.
ఇక ఎస్ఆర్హెచ్ తో మంగళవారం ముగిసిన మ్యాచ్ లో టిమ్ డేవిడ్ రనౌట్ కాకపోయి ఉంటే మ్యాచ్ లో తాము గెలిచేవాళ్లమని ఇషాన్ అన్నాడు. కీలక సమయంలో అతడు రనౌట్ అవడం వల్ల మ్యాచ్ తమ చేతుల్లో నుంచి చేజారిందని తెలిపాడు