- Home
- Sports
- Cricket
- నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ... సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్! వీరూ రిప్లై...
నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ... సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్! వీరూ రిప్లై...
క్రికెట్‌లో ఓపెనర్లుగా వస్తే ఎక్కువ సెంచరీలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటర్ల కంటే ఓపెనర్లు ఎక్కువ బంతులు ఆడొచ్చు, కాబట్టి పరుగులు ఎక్కువగా చేయొచ్చు.. అయితే ఓపెనర్‌గా వస్తే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది... ఫలితం హెయిర్ లాస్..
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాడు. ఓపెనర్‌గా రావడం వల్లే తన నెత్తి మీద వెంట్రుకలన్నీ రాలిపోయాయని వాపోయాడు. మూడు పదుల వయసు రాకపోతే అరగండులా మారిన పృథ్వీ షా పరిస్థితి కూడా ఇదే...
sehwag akhtar
టీమిండియా తరుపున టెస్టుల్లో రెండు త్రిబుల్ సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగ్, ముల్తాన్‌లో పాకిస్తాన్‌పై త్రిశతకం బాది ‘ముల్తాన్ కా సుల్తాన్’గా ప్రశంసలు దక్కించుకున్నాడు. తాజాగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌తో స్నేహం గురించి బయటపెట్టాడు వీరూ...
Virender Sehwag, Shoaib Akhtar
తాజాగా బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ప్రోగ్రామ్‌కి హాజరైన వీరేంద్ర సెహ్వాగ్‌కి ‘అప్పట్లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే మాటల యుద్దం జరిగేది. ఇండియా, పాక్ ప్లేయర్ల మధ్య ఫ్రెండ్‌షిప్ ఉండేదా?’ అనే ప్రశ్న ఎదురైంది...
‘ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ యుద్ధం కూడా ఉంటుంది. స్నేహంలో గొడవలు కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే షోయబ్ అక్తర్, నేనూ 2003-04 వరకూ చాలా మంచి స్నేహితులం. మేం రెండు సార్లు పాకిస్తాన్‌కి వెళ్లాం, వాళ్లు రెండు సార్లు ఇక్కడికి వచ్చారు...
అయితే స్నేహంలో మజాక్‌లు, తిట్టుకోవడాలు కూడా ఉంటాయి. ఓసారి సెహ్వాగ్ నెత్తి మీద ఉన్న జట్టు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని షోయబ్ అక్తర్ కామెంట్ చేశాడు. ఇప్పుడు చెబుతున్నా నీ దగ్గర ఉన్న నోట్ల కంటే నా నెత్తి మీద జట్టు ఎక్కువగా ఉంది చూసుకో...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
2016లో షోయబ్ అక్తర్, భారత యంగ్ క్రికెటర్లను పొగుడుతూ యూట్యూబ్‌లో వీడియోలు చేయడం మొదలెట్టాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. ‘మా వాళ్ల సంగతి మాకు తెలుసు, మీ వాళ్లు ఎలా ఆడుతున్నారో చూసుకో.. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతావా’ అంటూ కామెంట్ చేశాడు..
దీనికి 2020లో రియాక్ట్ అయిన షోయబ్ అక్తర్... ‘నా దగ్గర నీ నెత్తి మీద వెంట్రుకల (బాల్) కంటే ఎక్కువ డబ్బులు (మాల్) ఉన్నాయి.
Akhtar and Sehwag
నాకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని నువ్వు కుళ్లుకుంటున్నావని నాకు అర్థమైంది. నేను ఈ స్థాయికి ఎదగడానికి 15 ఏళ్లు పట్టింది’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్..