- Home
- Sports
- Cricket
- ఉదయం నుంచి కడుపునొప్పి! వరల్డ్ కప్ ఫైనల్ అయితే వదిలేస్తానా... షాకింగ్ విషయాలు చెప్పిన సూర్యకుమార్ యాదవ్...
ఉదయం నుంచి కడుపునొప్పి! వరల్డ్ కప్ ఫైనల్ అయితే వదిలేస్తానా... షాకింగ్ విషయాలు చెప్పిన సూర్యకుమార్ యాదవ్...
ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నా, టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి చాలా కాలమే ఎదురుచూశాడు సూర్యకుమార్ యాదవ్.ఐపీఎల్ 2020 తర్వాత టీమిండియాలోకి వచ్చిన సూర్య, టీమిండియాకి కీ మెంబర్‌గా మారిపోయాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు సూర్య భాయ్...

Image credit: Getty
ఈ ఏడాది 682 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా తరుపున మాత్రమే కాకుండా 2022లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 2018లో 689 పరుగులు చేసిన శిఖర్ ధావన్ రికార్డుకి 7 పరుగుల దూరంలో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్...
Image credit: PTI
ఇప్పటిదాకా 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్యకుమార్ యాదవ్, హైదరాబాద్ మ్యాచ్‌లో 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. సూర్యకి ఇది టీ20ల్లో ఆరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు...
అతి తక్కువ మ్యాచుల్లో 6 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన భారత ప్లేయర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. యువరాజ్ సింగ్ 33, విరాట్ కోహ్లీ 35 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించి... సూర్య భాయ్ తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు...
29 ఇన్నింగ్స్‌ల్లో 50 టీ20 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్, అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత ప్లేయర్‌గానూ నిలిచాడు. యువరాజ్ సింగ్, కెఎల్ రాహుల్ 31 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.. ఈ ఏడాది 42 సిక్సర్లు బాదిన సూర్యకుమార్ యాదవ్, ఒకే ఏడాదిలో అత్యంత వేగంగా బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు..
Suryakumar Yadav
‘వాతావరణ మార్పులు, ట్రావెలింగ్ పడక ఉదయాన్ని కడుపు నొప్పి మొదలైంది. ఆ తర్వాత జ్వరం పట్టింది. అయితే సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో తప్పక ఆడాలని అనుకున్నా. అందుకే నా డాక్టర్‌కి, ఫిజియోకి ఈ విషయం చెప్పాను...
Image credit: Getty
మీరు ఏం చేస్తారో తెలీదు, ఈ రోజు మ్యాచ్ నేను ఆడాలని చెప్పా. ఇదే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే ఆడకుండా తప్పించుకోలేను కదా... అందుకే ఆడాలనే పట్టుబట్టా. మందులు ఇస్తారా? ఇంజక్షన్ ఇస్తారా... మ్యాచ్ సమయానికి ఫిట్‌గా ఉండాలని చెప్పా..’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...