అతన్ని ఎందుకు ఆడించలేదో నాకేం తెలుసు... రిషబ్ పంత్‌పై రవీంద్ర జడేజా కామెంట్...
ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. టీమిండియాకి ప్రధాన ప్లేయర్‌గా ఉన్న రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని ఆడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మూడేళ్లుగా టీమిండియాలో చోటు కోల్పోయాడు దినేశ్ కార్తీక్. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని దినేశ్ కార్తీక్, ఇక రిటైర్మెంట్ ఇస్తాడని అనుకున్నారంతా. అయితే ఐపీఎల్ 2022 పర్ఫామెన్స్‌తో దినేశ్ కార్తీక్‌కి అన్యూహ్యంగా టీమిండియాలో చోటు దక్కింది...
Rishabh Pant
ఐపీఎల్ 2022 తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ టూర్లలో ఆడిన దినేశ్ కార్తీక్‌ని ఆసియా కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసింది భారత జట్టు... పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి దినేశ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు కల్పించడం హాట్ టాపిక్ అయ్యింది.
DK and Rishabh
తాజాగా హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌కి ముందు మీడియా సమావేశానికి హాజరైన భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఈ ప్రశ్నే ఎదురైంది. ‘రిషబ్ పంత్‌ని పక్కనబెట్టి దినేశ్ కార్తీక్‌ని ఎందుకు ఆడించారు? మిగిలిన మ్యాచుల్లో అయినా పంత్‌కి చోటు దక్కుతుందా?’ అనే ఓ విలేఖరి ప్రశ్నించాడు...
Image credit: PTI
దానికి రవీంద్ర జడేజా... ‘నాకు ఈ విషయం అస్సలు తెలీదు. అతన్ని ఎందుకు ఆడించలేదనేది నా బుక్‌లో లేని ప్రశ్న. దీనికి నేనెలా సమాధానం చెప్పగలను...’ అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. హంగ్‌కాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌ని తప్పించి, రిషబ్ పంత్‌ని ఓపెనర్‌గా ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు...
Image credit: Getty
పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు కెఎల్ రాహుల్. అంతకుముందు జింబాబ్వే టూర్‌లోనూ రెండు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చిన కెఎల్ రాహుల్, పెద్దగా మెప్పించలేకపోయాడు. కాబట్టి అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడించాలని అంటున్నారు అభిమానులు..