- Home
- Sports
- Cricket
- 2010లోనే దీని గురించి మాట్లాడుకున్నాం! ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే... - పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్
2010లోనే దీని గురించి మాట్లాడుకున్నాం! ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మేమే... - పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపైనే పడింది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...

2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇండియాలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. 1 లక్షా 30 వేల కెపాసిటీ ఉన్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాయాదుల పోరు జరగనుంది.. ఈ మ్యాచ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్...
‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్ అంటే చాలా స్పెషల్. నేను బాబర్ ఆజమ్, ఈ విషయం గురించి 2010లో మాట్లాడుకున్నాం. ఇండియాలో మ్యాచ్ ఆడితే ఆ వాతావరణం, ప్రేక్షకుల గోలలు... ఆ ఫీల్ ఎలా ఉంటుందో చాలాసార్లు విన్నాం. దాన్ని అనుభూతి చెందడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాం..
imam ul haq
ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్, చాలా అద్భుతంగా సెట్ అయిందని నా అభిప్రాయం. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన పాకిస్తాన్ టీమ్ కాంబినేషన్‌లాగే అనిపించినా, అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. ప్లేయర్లకు అవకాశాలు ఇస్తూ ఉంటేనే స్టార్లు తయారు అవుతారు..
imam ul haq
పాకిస్తాన్‌లో 350 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించాం. సౌతాఫ్రికాలో 330 పరుగుల స్కోరు చేసి, సిరీస్ కూడా గెలిచాం. టీమ్‌లో ప్రతీ ఒక్కరూ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కాస్త ప్రెషర్ కూడా ఉంది..
ఇండియాలో మ్యాచ్ అంటే ఆ మాత్రం ప్రెషర్ ఉండడం కామన్. అందులో దాచాల్సింది ఏదీ లేదు. అయితే ఈ జట్టు అద్భుతాలు చేయగలదు. ఇండియాలో వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, అది పాకిస్తాన్ టీమ్‌కి చాలా గర్వకారణం.. మేం దాన్ని సాధించగలమనే నమ్ముతున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్..
imam ul haq
హైదరాబాద్‌లో రెండు మ్యాచులు ఆడబోతున్న పాకిస్తాన్ టీమ్, చెన్నై, బెంగళూరు, కోల్‌కత్తా నగరాల్లో మిగిలిన వరల్డ్ కప్ మ్యాచులు ఆడనుంది. పాకిస్తాన్ సెమీస్‌కి అర్హత సాధిస్తే, కోల్‌కత్తాలో సెమీ ఫైనల్ ఆడనుంది..