MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ఎమ్మెస్ ధోనీ వల్లే నేను టీమిండియా కెప్టెన్ కాలేకపోయాను... రాహుల్ ద్రావిడ్ తర్వాత...

ఎమ్మెస్ ధోనీ వల్లే నేను టీమిండియా కెప్టెన్ కాలేకపోయాను... రాహుల్ ద్రావిడ్ తర్వాత...

యువరాజ్ సింగ్, టీమిండియాలో టాప్ ఆల్‌రౌండర్.  2007టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ దక్కడంలో యువరాజ్ సింగ్‌ది కీ రోల్. గౌతమ్ గంభీర్‌లాగే యువరాజ్ సింగ్‌కి కూడా ఈ రెండు విజయాల్లో రావాల్సినంత క్రెడిట్ దక్కలేదు. అలాగే టీమిండియాలో చోటు కోసం ఏళ్ల పాటు ఎదురుచూసి, నిరాశగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 07 2022, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కంటే ముందే భారత జట్టులో చోటు దక్కించుకున్న యువరాజ్ సింగ్, ఒకానొక టైంలో తనకి కెప్టెన్సీ వస్తుందని ఆశించాడట...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213

2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఘోర పరాభవం తర్వాత రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ తీసుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు..

313

హాఫ్ ఫెవరెట్స్‌గా 2007 వన్డే వరల్డ్‌కప్ బరిలో దిగిన భారత జట్టు, గ్రూప్ స్టేజ్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి తర్వాత భారత క్రికెటర్ల ఇళ్లపై రాళ్ల దాడి చేసిన అభిమానులు, రోడ్లపై వారి దిష్టి బొమ్మలను తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు...

413

రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు టీ20 వరల్డ్‌కప్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు...

513

‘2007 వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఓటమి తర్వాత టీమ్‌లో ఓ రకమైన సందిగ్ధత నెలకొంది. ఇంగ్లాండ్‌కి రెండు నెలల టూర్ ఉంది. అలాగే సౌతాఫ్రికా, ఐర్లాండ్ టూర్లు కూడా ఉన్నాయి... ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్... 

613

మొత్తంగా స్వదేశానికి దూరంగా నాలుగు నెలలు పాటు గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో సీనియర్లు తమకి బ్రేక్ కావాలని నిర్ణయం తీసుకున్నారు. 

713

2007 వన్డే వరల్డ్‌కప్‌లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఎవ్వరూ టీ20 వరల్డ్‌కప్‌ 2007ని సీరియస్‌గా తీసుకోలేదు... దాంతో నాకు టీ20 కెప్టెన్‌గా అవకాశం దక్కుతుందని ఆశించాను....

813

ఆ సమయంలోనే మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా నియమిస్తూ ప్రకటన వచ్చింది. అతను నా కంటే జూనియర్, అయినా నేను కెప్టెన్ కాలేకపోయా... ఎవరు కెప్టెన్ అయినా అతనికి పూర్తిగా సపోర్ట్ చేయాలని అనుకున్నా! అంతకుముందు రాహుల్ ద్రావిడ్, గంగూలీ కెప్టెన్సీలో అలాగే చేశా...’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

913

టీ20 వరల్డ్‌కప్ నుంచి విశ్రాంతి తీసుకున్న జహీర్ ఖాన్, క్రిస్ గేల్ 50 బంతుల్లో సెంచరీ చేయడం చూసిన తర్వాత... ‘థ్యాంక్ గాడ్, నేను ఈ టోర్నమెంట్ నుంచి రెస్ట్ తీసుకున్నా...’ అని మెసేజ్ చేశాడు. 

1013

టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత అతనే మళ్లీ ‘ఓ నో... నేను రెస్టు తీసుకోకుండా ఉండాల్సింది’ అంటూ మెసేజ్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్.

1113

‘2007లో మేం యంగ్ టీమ్. మాకు ఇంటర్నేషనల్ కోచ్ కూడా లేదు. అప్పుడు లాల్‌చంద్ రాజ్‌పుత్‌ కోచ్‌గా ఉన్నారు. వెంకటేశ్ ప్రసాద్ మా బౌలింగ్ కోచ్. జట్టు అంతా యువకులు, యంగ్ కెప్టెన్... టీ20 క్రికెట్ గురించి పెద్దగా ఎవరికీ ఏమీ తెలీదు.

1213

టీ20 వరల్డ్‌కప్‌కి ముందు మేం ఒకటో రెండో టీ20లు ఆడామనుకుంటా అంతే... అదీకాక అదే ఫస్ట్ టోర్నీ. మేం ఎలాంటి ప్లాన్స్ లేకుండా సౌతాఫ్రికా వెళ్లాం. అయితే మేం అనుకున్నదానికంటే చాలా బాగా రాణించాం. విజయం కోసం మేం వేసిన ప్లాన్స్ చాలా వరకు వర్కవుట్ అయ్యాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు యువీ...

1313

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, టోర్నీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్‌రౌండ్ షోతో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచాడు.

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved