- Home
- Sports
- Cricket
- సత్తిరెడ్డీ.. సఫారీలొస్తున్నారు..! ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సౌతాఫ్రికా ప్లేయర్లు..
సత్తిరెడ్డీ.. సఫారీలొస్తున్నారు..! ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సౌతాఫ్రికా ప్లేయర్లు..
IPL 2023: ఐపీఎల్ లో గడిచిన మూడు రోజుల్లో అన్ని జట్ల తొలి మ్యాచ్ లు ముగిశాయి. అయితే ఈ ఐదు మ్యాచ్ లలో సఫారీ ప్లేయర్లు ఆడలేదు.

ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ను ముగించి రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలకు దక్షిణాఫ్రికా క్రికెటర్లు గుడ్ న్యూస్ చెప్పారు. మరికొన్ని గంటల్లో తాము భారత్ లో ల్యాండ్ కాబోతున్నామని తెలిపారు. ఐపీఎల్ లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లు నేటి రాత్రికే భారత్ కు రానున్నారు.
దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఆన్రిచ్ నోర్త్జ్, లుంగి ఎంగిడి లు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతుండగా..కిల్లర్ మిల్లర్.. గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్నాడు. క్వింటన్ డికాక్.. లక్నో సూపర్ జెయింట్స్ కు, కగిసో రబాడా పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న సిసంద మగలతో పాటు డ్వేన్ ప్రిటోరియస్ కూడా ఆ జట్టుతో కలుస్తాడు.
Image credit: PTI
అందరికంటే ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తో పాటు ఆ జట్టు తరఫున ఆడుతున్న హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ లు నేటి రాత్రి గానీ రేపు గానీ సన్ రైజర్స్ టీమ్ తో కలవనున్నారు. స్వదేశంలో నెదర్లాండ్స్ తో రెండు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికా టీమ్ మెంబర్స్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.
markram and hendricks
నెదర్లాండ్స్ పై ఆదివారం జోహన్నస్‌బర్గ్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 370 పరుగులు చేశారు. ఎయిడెన్ మార్క్‌రమ్.. (175) వీరవిహారానికి తోడు కిల్లర్ మిల్లర్ (91) విధ్వంసం తోడుకావడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్.. 39.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ బౌలర్ సిసంద మగల ఐదు వికెట్లతో చెలరేగాడు.
Dewald Brevis
అయితే కొంతమంది టీ20 స్టార్స్ మాత్రం ఇప్పటికే ఇండియాకు చేరుకుని ఐపీఎల్ లో పలు టీమ్ లలో ఆడుతున్నారు. ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ ముంబై టీమ్ లో ఉన్నారు. రిలీ రూసో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతుండగా డుప్లెసిస్ ఆర్సీబీ సారథిగా ఉన్నాడు. వీళ్లు తమ జట్ల తరఫున మ్యాచ్ లు కూడా ఆడారు.
రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో మార్క్‌రమ్, క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లు లేని లోటు స్పష్టంగా కనిపించింది. అలాగే బౌలింగ్ లో అనుభవలేమి కూడా కొట్టొచ్చినట్టు ఉంది. టీమ్ లో భువనేశ్వర్ తప్ప అనుభవజ్ఞుడైన పేసర్ లేకపోవడం సన్ రైజర్స్ ను తీవ్రంగా ప్రభావం చేసింది. మార్క్‌రమ్, క్లాసెన్, జాన్సేన్ ల రాకతో టీమ్ దృఢంగా మారింది.
ఇదిలాఉండగా.. ఐపీఎల్ ను గడిచిన 15 సీజన్లుగా టీవీలలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సౌతాఫ్రికా అభిమానులకు ఈ ఏడాది షాక్ తాకింది. గత 15 ఏండ్లుగా సౌతాఫ్రికాలో ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకున్న సూపర్ స్పోర్ట్ ఛానెల్ ఈ ఏడాది మాత్రం తప్పుకుంది. ఈ సీజన్ లో సబ్ సహరన్ ఆఫ్రికన్ టీవీ హక్కులను వయాకామ్ 18 దక్కించుకుంది.