MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించిందిలా... టీ20 వరల్డ్‌కప్ తర్వాత...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించిందిలా... టీ20 వరల్డ్‌కప్ తర్వాత...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా టేబుల్ టాపర్‌గా అర్హత సాధించింది. మరో ఫైనలిస్ట్ న్యూజిలాండ్‌తో పోలిస్తే టీమిండియా ఫైనల్ ప్రస్థానం చాలా కష్టంగానే సాగింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ టీమ్‌గా నిలుస్తూ ఐదేళ్లుగా టెస్టు ఛాంపియన్‌షిప్ గదను అందుకుంటున్న కోహ్లీ, ఈసారి టైటిల్ కోసం మెగా ఫైనల్‌లో పోరాడబోతున్నాడు...

3 Min read
Chinthakindhi Ramu
Published : Jun 17 2021, 09:54 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
117

2007లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్‌కి ప్రవేశించిన టీమిండియా, ఆ తర్వాత ఐసీసీ ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలోనూ ఫైనల్‌కి చేరడం విశేషం. అటు పొట్టి ఫార్మాట్‌లోనూ, ఇటు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రెండింట్లోనూ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు టీమిండియానే.

217

వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ ప్లేస్‌లో 2013లోనే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టాలని భావించింది ఐసీసీ. అయితే అది కార్యరూపం దాల్చేందుకు ఆరేళ్ల సమయం పట్టింది. ఎట్టకేలకు 2019లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని ఆరంభించిన ఐసీసీ, 2021 జూన్ 18న లార్డ్స్ మైదానం వేదికగా ఫైనల్ నిర్వహించాలని భావించింది.

317

అయితే ఫైనల్ మ్యాచ్‌కి ఇంగ్లాండ్ అర్హత సాధించకపోవడం, లండన్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో తుది సమరానికి వేదిక సౌంతిప్టన్‌కి మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ...

417

ఆగస్టు 1, 2019న ప్రారంభమైన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ పాల్గొన్నాయి. ఒక్కో జట్టు ఆరు ప్రత్యర్థులతో సిరీస్ ఆడాల్సి ఉంటుంది...

517

అయితే కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు రద్దయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా 19 మ్యాచులు ఆడాల్సి ఉన్నా, 14 మ్యాచులు ఆడగలిగింది. ఇండియాతో పాటు ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు మాత్రమే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మ్యాచులన్నీ పూర్తి చేశాయి...

617

2019లో వెస్టిండీస్ పర్యటనతో టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని ఆరంభించింది టీమిండియా. ఈ టూర్‌లో వెస్టిండీస్‌ను 2-0తేడాతో చిత్తు చేసి 120 పాయింట్లు సొంతం చేసుకుంది...

717

ఆ తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది భారత జట్టు. ఈ సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఖాతాలోకి మరో 120 పాయింట్లు చేరాయి.

817

సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది విరాట్ సే. ఈ విజయంతో మరో 120 పాయింట్లు భారత జట్టు ఖాతాలో చేరాయి.

917

ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లిన భారత జట్టు, అక్కడ రెండు టెస్టుల్లోనూ చిత్తుగా ఓడి, 0-2 తేడాతో సిరీస్ అప్పగించింది. ఈ ఓటమితో భారత జట్టుకి పాయింట్లేమీ రాకపోగా, న్యూజిలాండ్ ఖాతాలో 120 పాయింట్లు చేరాయి.

1017

అప్పటిదాకా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీలో 360 పాయింట్లతో టాప్‌లో ఉంది భారత జట్టు. అయితే కరోనా లాక్‌డౌన్ కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో పాయింట్ల ప్రాతిపాదికనగా కాకుండా విజయాల శాతాన్ని లెక్కలోకి తీసుకుని ఫైనల్ పోటీదారులను నిర్ణయించాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ.

1117

దీంతో భారత జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. ఫైనల్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన రెండు సిరీస్‌ల్లోనూ విజయం సాధించాల్సిందే. అదీకాకుండా ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా సిరీస్ గెలవడమంటే అంత తేలికైన విషయం కాదు...

1217

2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆరంభించిన భారత జట్టు, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి చెత్త రికార్డును మూటగట్టుకుంది. అయితే ఆడిలైడ్ పరాజయం నుంచి అన్యూహ్యంగా బయటపడి, మెల్‌బోర్న్‌లో విజయాన్ని అందుకుంది టీమిండియా.

1317

మెల్‌బోర్న్‌లో విజయం తర్వాత సిడ్నీలో టెస్టు డ్రాగా ముగియగా... 32 ఏళ్లుగా ఆస్ట్రేలియాకి ఓటమి రుచి తెలియని గబ్బాలో చివరి టెస్టు ఆడాల్సి రావడంతో అభిమానుల్లో కలవరం మొదలైంది. ఐదో రోజు కొండంత లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు, కుర్రాళ్లతో సంచలన విజయం సాధించి ఆస్ట్రేలియాకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

1417

ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇంగ్లాండ్‌తో స్వదేశంలో సిరీస్. తొలి టెస్టులోనే భారత జట్టు భారీ తేడాతో చిత్తుగా ఓడింది. మళ్లీ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచుల్లో కనీసం రెండు టెస్టులను గెలిచి, ఓ టెస్టు డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి... ఇదే సమయంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన టెస్టు సిరీస్ రద్దయ్యింది.

1517

దీంతో న్యూజిలాండ్ నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది. మరో ప్లేస్ కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, టీమిండియా మధ్యే పోటీ. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్ ఫలితాన్ని బట్టే ఆస్ట్రేలియా అర్హత సాధించే పరిస్థితి.

1617

అయితే తొలి టెస్టు పరాజయం తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన టీమిండియా, పర్యాటక జట్టుకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. మిగిలిన మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి 3-1 తేడాతో సిరీస్ గెలిచింది. ఈ విజయంతో టేబుల్ టాపర్‌గా భారత జట్టు ఫైనల్‌కి అర్హత సాధించింది.

1717

న్యూజిలాండ్ మాత్రం శ్రీలంకతో శ్రీలంకలో ఆడిన టెస్టు సిరీస్ డ్రా చేసుకుని, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఆడిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. టీమిండియాను స్వదేశంలో ఓడించిన తర్వాత వెస్టిండీస్, పాకిస్తాన్ వంటి చిన్న జట్లపై విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved