- Home
- Sports
- Cricket
- ఎన్ని రన్స్ చేసినా ఏం ఉపయోగం.. అతడి బ్యాటింగ్ లో పవర్ తగ్గింది.. కోహ్లిపై మళ్లీ నోరుపారేసుకున్న మంజ్రేకర్
ఎన్ని రన్స్ చేసినా ఏం ఉపయోగం.. అతడి బ్యాటింగ్ లో పవర్ తగ్గింది.. కోహ్లిపై మళ్లీ నోరుపారేసుకున్న మంజ్రేకర్
TATA IPL 2022 Updates: గత కొన్నాళ్లుగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఆటతీరుపై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆర్సీబీ మాజీ సారథి ప్రస్తుతం ఆ జట్టులో సీనియర్ ప్లేయర్ గా ఉన్న విరాట్ కోహ్లి పరుగులైతే చేస్తున్నాడేమో గానీ అది అతడి స్థాయి ప్రదర్శన కాదని అంటున్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.
కోహ్లి ఉన్నది ఇటువంటి ఇన్నింగ్స్ లు ఆడటానికి కాదని.. అతడి బ్యాటింగ్ లో పవర్ తగ్గిందని సంచలన కామెంట్స్ చేశాడు. విరాట్ ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రాలేదని చెప్పుకొచ్చాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్ తో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి కొన్ని పరుగులైతే చేస్తున్నాడు. కానీ అతడి నుంచి నేను గానీ అతడి అభిమానులు గానీ ఆశించింది ఇది కాదు. గతంలో కోహ్లి హిట్టింగ్ కు దిగితే చూడముచ్చటగా ఉండేది.
సిక్సర్ కొడితే బంతి స్టాండ్స్ లో పడేది. కానీ ఇప్పుడు ఆ పవర్ ఏది..? ఏదో కేవలం బౌండరీ రోప్ ను టచ్ చేస్తే చాలు అన్నట్టుగా కోహ్లి బ్యాటింగ్ సాగుతోందే తప్ప పవర్ గేమ్ చాలా తగ్గింది.
ఐదారేండ్ల క్రితం చూడండి.. కోహ్లి భారీ సిక్సర్లు కొట్టేవాడు. నేను అతడు హిట్టింగ్ పై మాత్రమే దృష్టి సారిస్తాను. అంతే తప్ప 40, 50 పరుగులు సాధించడం మీద కాదు.. నాకు అది ముఖ్యం కాదు..
మళ్లీ కోహ్లి భారీ హిట్టింగ్ కు దిగినప్పుడే అతడు విరాట్ టీ20 క్రికెట్ లోకి పునరాగమనం చేశాడని చెప్తా..’ అని మంజ్రేకర్ వివరించాడు.
ఈ సీజన్ లో ఇప్పటివరకు కోహ్లి.. నాలుగు మ్యాచులాడి 106 పరుగులు చేశాడు. పంజాబ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో 29 బంతుల్లో 41 రన్స్ చేశాడు కోహ్లి. తర్వాత కోల్కతా పై 7 బంతుల్లో 12, రాజస్థాన్ పై 6 బంతుల్లో 5 రన్స్ కొట్టాడు. ఇటీవలే ముంబైతో ముగిసిన మ్యాచ్ లో 36 బంతుల్లో 48 పరుగులు సాధించాడు.
మంజ్రేకర్ చెప్పినట్టు అడపా దడపా బౌండరీలే తప్ప కోహ్లి గతంలొ మాదిరి పవర్ హిట్టింగ్ చేయడం లేదని అతడి అభిమానుల నుంచి కూడా ఫిర్యాదులున్నాయి.