క్రికెట్ ఆడాలంటే దాన్ని తప్పనిసరి చేయండి... సచిన్ టెండూల్కర్ సలహా...

First Published 3, Nov 2020, 8:34 PM

IPL 2020 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. రెండు నెలల పాటు సాగిన ఈ మెగా టోర్నీ కారణంగా మిచెల్ మార్ష్, భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, అమిత్ మిశ్రా, మిచెల్ మార్ష్, కేన్ విలియంసన్, ఆండ్రే రస్సెల్, రోహిత్ శర్మ వంటి ఎందరో ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. చివరి మ్యాచుల్లో కూడా గాయాలబారిన పడుతూనే ఉన్నారు.

కాళ్లు, చేతులకు తగిలితే గాయాలు మాత్రమే అవుతాయి, అదే 100 కి.మీ.ల కంటే వేగంగా దూసుకొచ్చే బంతి తలకి బలంగా తగిలితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది... దీంతో బ్యాట్స్‌మెన్ హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి చేయాలని చెబుతున్నాడు సచిన్ టెండూల్కర్.

2014లో ఆసీస్ యంగ్ ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ ఇలాంటి గాయం కారణంగానే మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదో విషాదకర సంఘటన...

అప్పటి నుంచి ఏ బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కి బంతి తగిలినా... కంగారు పడుతూ అతన్ని చేరుకుంటూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు క్రికెటర్లు...

ఐపీఎల్ 2020 సీజన్‌లో భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ కూడా ఈ విధమైన గాయపడ్డాడు.... కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ విసిరిన త్రో, విజయ్ శంకర్‌కి తగిలింది.

హెల్మెట్ ధరించినా పూరన్ విసిరిన బలమైన త్రో గాయానికి విలవిలలాడిపోయాడు విజయ్ శంకర్. ఈ గాయం నుంచి కోలుకున్నా, బౌలింగ్ వేసే సమయంలో అయిన గాయంతో  పెవిలియన్ చేరి, ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ నుంచే తప్పుకున్నాడు.

క్రికెట్ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్ బౌలింగ్ చేసినా, పేసర్ బౌలింగ్ చేసినా బ్యాట్స్‌మెన్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా నిబంధనను మార్చాలి... అంటూ ఐసీసీని కోరాడు సచిన్ టెండూల్కర్.

ఉక్కపోత కారణంగా చాలామంది క్రికెటర్లు హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు. స్పీడ్ బౌలింగ్‌లో మాత్రమే తప్పదన్నట్టు హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేం...

కాబట్టి బౌలింగ్ ఎవ్వరిదైనా బ్యాట్స్‌మెన్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయాలి... అది క్రికెటర్ల ప్రాణాలను కాపాడుతుంది.... ఈ నిబంధనను తేవాల్సిందిగా ఐసీసీని కోరుతున్నా... అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్.