- Home
- Sports
- Cricket
- Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు వచ్చేసాడ్రోయ్ ... పిచ్చకొట్టుడు కొట్టడంలో ఇక బేరాల్లేవమ్మా!
Heinrich Klaasen : కాటేరమ్మ కొడుకు వచ్చేసాడ్రోయ్ ... పిచ్చకొట్టుడు కొట్టడంలో ఇక బేరాల్లేవమ్మా!
హెన్రిచ్ క్లాసేన్ ... తెెలుగు క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరిది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఐపిఎల్ లో ఆడుతున్న ఇతడు సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదు... అందుకే ఇతడిని ఫ్యాన్స్ కాటేరమ్మ కొడుకుగా పేర్కొంటారు.

heinrich klaasen
Heinrich Klaasen : వీడు క్రీజులోకి వచ్చాడంటే బౌండరీ చిన్నబోవాల్సిందే... .ప్రత్యర్థి బౌలర్లకు ఊచకోత తప్పదు. అందుకే వీడిని తెలుగు ఫ్యాన్స్ ముద్దుగా 'కాటేరమ్మ కొడుకు' అని పిలుచుకుంటారు... ఈ పేరు అతడికి సరిగ్గా సరిపోతుంది. సలార్ మూవీలో కాటేరమ్మ ఫైట్ హైలైట్... కానీ ఐపిఎల్ మూవీలో మన కాటేరమ్మ కొడుకు క్లాసేన్ ఊచకోతే హైలైట్.
మైదానంలో అడుగుపెట్టాడంటే అతడు పూనకంతో ఊగిపోతాడు. పరుగుల దాహాన్ని తీర్చుకోవాలని పరితపిస్తాడు. మొత్తంగా ప్రత్యర్థులను పిండి ఆరేస్తాడు. అందువల్లే ఇతడి బ్యాటింగ్ ను ఇష్టపడని అభిమాని ఉండడంతే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్ టీంలో అందరూ హిట్టర్లే... ట్రావిస్ హెడ్ నుండి ఇటీవలే టీంలో చేరిన ఇషాక్ కిషన్ వరకు. కానీ వీళ్లంతా ఒకెత్తు... ఒక్క క్లాసేన్ ఇంకొకెత్తు. అతడు క్రీజులో అడుగుపెట్టగానే బౌండరీల మోత మోగిస్తాడు. అందుకే అతడు మైదానంలోకి వస్తుంటే ఓ మాస్ హీరోకు ఉన్నంత ఎలివేషన్ ఉంటుంది.... ప్రత్యర్థులు 'వాడు వచ్చాడ్రా బాబు' అనుకుంటారు. కేవలం అతడి పేరులోనే క్లాస్ ఉంది... ఆటంతా మాస్.. ఊర మాస్ ఉంటుంది.
heinrich klaasen
ఇదేం మాస్ హిట్టింగ్ క్లాసేన్ భయ్యా...
క్లాసేన్ హిట్టింగ్ ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తుంది... వందల వికెట్లు తీసిన బౌలర్ అయినా సరే అతడి ముందు గల్లీ క్రికెటర్ గా మారిపోవాల్సిందే. బౌండరీలు బాదడంలో 'బేరాల్లేవమ్మా' అంటాడు మన క్లాసేన్. అతడు క్రీజులో కొద్దిసేపు ఉన్నాడంటే మైదానంలో సునామీ వచ్చినట్లుంది.... పరుగుల వరద ఖాయం. స్కోరు రాకెట్ స్పీడ్ తో దూసుకెళుతుంది. ఇలా ప్రకృతి ఎంత ఫవర్ పులో క్లాసేన్ కూడా అంతే పవర్ ఫుల్. హిట్టర్లతో కూడిన ఎస్ఆర్హెచ్ కే ఇతడు హిట్టింగ్ మాస్టర్. టీ20 అంటేనే ధనాధన్ క్రికెట్... దాన్నే మరోస్థాయికి తీసుకెళ్లాడు క్లాసేస్.
క్లాసేస్ ఆటకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతారు. అతడికి ఎంతలా కనెక్ట్ అయ్యారంటే మన కూకట్ పల్లి కుర్రాడే అన్నట్లు భావిస్తారు. క్లాసేన్ ఊర మాస్ కు సన్ రైజర్స్ మాస్ బ్యాటింగ్ లైనప్ తోడవడంతో మంచి మసాలా మ్యాచ్ జరుగుతోంది. ఐపిఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోర్ రికార్డులన్నీ మనవే... అదీ సన్ రైజర్స్ అంటే, అదీ కాటేరమ్మ కొడుకు క్లాసేన్ అంటే.
heinrich klaasen
క్లాసేన్ ఐపిఎల్ కెరీర్ :
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనే విధ్వంసకర బ్యాట్ మెన్ గా క్లాసెన్ గుర్తింపు పొందాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే పిచ్చకొట్టుడు కొడతాడు. ప్రతి బాల్ ను బౌండరీకీ తరలించడమే అతడికి తెలిసిన క్రికెట్. ఇలా గత ఐపిఎల్ లో పెను విధ్వంసమే సృష్టించాడు. 16 మ్యాచులాడిన ఇతడు నాలుగు హాఫ్ సెంచరీలతో 479 పరుగులు చేసాడు. ఇందులో 80 హయ్యెస్ట్ స్కోరు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అతడు గత సీజన్ లో మొత్తం 19 ఫోర్లు బాదిన వీటికి డబుల్ 38 సిక్సర్లు బాదాడు.
2023 లో కూడా క్లాసేన్ అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్ ఓ సెంచరీ (104 పరుగులు) బాదాడు. అలాగే రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్ లో కేవలం 12 మ్యాచులే ఆడిన అతడు 448 పరుగులు చేసాడు. మొత్తంగా ఐపిఎల్ కెరీర్ లో 993 పరుగులు చేసాడు. ఇందులో 64 సిక్సర్లు, 56 ఫోర్లు ఉన్నాయి..