MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆసియా కప్‌లో మునపటి కోహ్లీని చూస్తాం.. ముందు అతడిని ఆడనివ్వండి : విరాట్‌కు మద్దతుగా దాదా

ఆసియా కప్‌లో మునపటి కోహ్లీని చూస్తాం.. ముందు అతడిని ఆడనివ్వండి : విరాట్‌కు మద్దతుగా దాదా

Sourav Ganguly On Virat Kohli: గతకొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ త్వరలో జరుగనున్న ఆసియా కప్ తో మునపటి ఫామ్ ను అందుకుంటాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. 

2 Min read
Author : Srinivas M
Published : Aug 16 2022, 01:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మూడేండ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. గడిచిన ఏడాదికాలంగా క్రీజులో నిలవడానికే తంటాలు పడుతున్నాడు. సెంచరీ సంగతి పక్కనబెడితే కనీసం అర్థ సెంచరీ చేసినా చాలని అతడి అభిమానులు చూస్తున్నారు. మరోవైపు అతడి అధ్వాన్న ఫామ్, వరుసగా విరామాలు ఇవ్వడంపై  విమర్శలు ఎదుర్కుంటున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: Getty

Image credit: Getty

ఈ క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ..  కోహ్లీకి అండగా నిలిచాడు. ఈనెల 27 నుంచి ప్రారంభం కాబోయే ఆసియా కప్ లో మునపటి కోహ్లీని చూస్తామని, ఆ టోర్నీలో అతడు ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

37

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా మాట్లాడుతూ.. ‘ముందు అతడిని ప్రాక్టీస్ చేయనివ్వండి. కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో వేలాది పరుగులు చేశాడు.  కోహ్లీ త్వరలోనే పుంజుకుంటాడు. సెంచరీలు చేయకపోవచ్చు. 

47

కానీ ఆసియా కప్ లో మునపటి కోహ్లీని చూస్తాం.  అతడు ఈ టోర్నీ ద్వారా పూర్వపు ఫామ్ ను అందుకుంటాడు. సెంచరీలు చేయకపోవచ్చు. కానీ తిరిగి పాత కోహ్లీని చూస్తామనే నమ్మకం నాకుంది..’ అని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు. 

57

ఐపీఎల్ ముగిసిన తర్వాత  వరుసగా విఫలమవుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్ తో సిరీస్ లో కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. దీంతో అతడిని వెస్టిండీస్ టూర్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చింది టీమిండియా. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తినా కోహ్లీ విరామం తీసుకున్నాడు. విరామం ముగించుకుని ఇటీవలే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. 

67

ఇదిలాఉండగా.. కోహ్లీతో పాటు ఐసీసీ అధ్యక్ష పదవి, ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ పై కూడా దాదా కామెంట్స్ చేశాడు. తాను ఐసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని, దానిపై బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని చెప్పాడు. 

77

ఇక ఆసియాకప్ లో భాగంగా  అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పై దాదా స్పందిస్తూ.. అదేం పెద్ద ప్రత్యేకమైన మ్యాచ్ కాదని అన్నాడు. మిగతా మ్యాచ్ లను ఎలా చూస్తామో ఇండియా-పాక్ మ్యాచ్ ను కూడా తాను అలాగే చూస్తానని  అన్నాడు.  ఆసియా కప్ లో ఇండియా-పాక్ మధ్య ఈనెల 28న జరగనుంది.

About the Author

SM
Srinivas M
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : మహిళల T20 వరల్డ్ కప్‌ విన్నింగ్ టీమ్ ప్రైజ్ మనీ ఎంత? ఓడిన టీమ్స్ కి ఎంతిస్తారు?
Recommended image2
T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే
Recommended image3
IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved