MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • నన్ను పనోడిలా చూశాడు.. బట్టలు, బూట్లు ఉతకమనేవాడు.. పాక్ మాజీ సారథిపై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్

నన్ను పనోడిలా చూశాడు.. బట్టలు, బూట్లు ఉతకమనేవాడు.. పాక్ మాజీ సారథిపై వసీం అక్రమ్ షాకింగ్ కామెంట్స్

పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన  వసీం అక్రమ్ తాజాగా తన ఆటో బయోగ్రఫీని విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ పుస్తకంలో అక్రమ్..  తన  సహచర ఆటగాడు, మాజీ సారథిపై  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

2 Min read
Author : Srinivas M
Published : Nov 28 2022, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పాకిస్తానీ వెటరన్ పేసర్ వసీం అక్రమ్  తన సహచర ఆటగాడు, మాజీ సారథి సలీమ్ మాలిక్ పై  సంచలన వ్యాఖ్యలు చేశాడు.  తనకంటే రెండేండ్లు ముందు జట్టులోకి వచ్చిన కారణంగా.. తనను  జూనియర్ గా భావించి  సపర్యలు చేయించుకునేవాడిని   ఒక బానిసలాగా ట్రీట్ చేసేవాడని అక్రమ్ ఆరోపించాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వసీం అక్రమ్ ఆటో బయోగ్రఫీ ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’ పుస్తకంలో  అక్రమ్ ఈ కామెంట్స్ చేశాడు.   సలీమ్ మాలిక్ తనను ఓ పనోడిలా  ఉపయోగించుకున్నాడని అప్పుడు తనకు  చాలా కోపంగా ఉండేదని  పుస్తకంలో పేర్కొన్నాడు.  సలీమ్ మాలిక్ 1982లో  పాక్ జట్టులోకి రాగా అక్రమ్ 1984లో జట్టులోకి వచ్చాడు. 

37

అక్రమ్ తన పుస్తకంలో.. ‘తన కంటే రెండేండ్లు జూనియర్ అయినందుకు అతడు ఆ అడ్వంటేజీని తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు.  సెల్ఫిష్. ఎప్పుడూ  నన్ను తనకు ఓ పనోడిలా భావించేవాడు. తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు,  బూట్లను ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది..’ అని రాసుకొచ్చాడు. 

47

ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం పాటు పాకిస్తాన్ క్రికెట్  లో భాగమయ్యారు.  ఇమ్రాన్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పాకిస్తాన్  సారథిగా సలీమ్ మాలిక్ ఎంపికయ్యాడు.  1992 నుంచి 1995 వరకు అక్రమ్.. మాలిక్ సారథ్యంలోనే ఆడాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య   తీవ్ర విభేదాలు వచ్చాయని అప్పట్లో పాకిస్తాన్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి.  2000వ సంవత్సరంలో సలీమ్.. మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ లో ఇరుక్కుని  క్రికెట్ లో జీవితకాల నిషేధం ఎదుర్కున్నాడు. 

57

కాగా గతంలో  మాలిక్ ఓ ఇంటర్వ్యూలో  తాను సారథిగా ఉన్నప్పుడు అక్రమ్, వకార్ యూనిస్ లు తనతో మాట్లాడకపోయేవారని వ్యాఖ్యానించాడు.  ‘నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు  అక్రమ్ కు బాల్ ఇవ్వడానికి వెళ్తే అతడు నా  చేతుల నుంచి బాల్ ను లాక్కునేవాడు. అక్రమ్, వకార్ లు నాతో మాట్లాడేవాళ్లు కాదు..’ అని  గతంలో వివరించాడు. తాజాగా అక్రమ్ చేసిన  కామెంట్స్.. వీళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనని తేల్చాయి. 

67

ఇక ఇదే పుస్తకంలో అక్రమ్ గతంలో ఇమ్రాన్ ఖాన్ తనను లండన్ లోని ఓ నైట్ క్లబ్ కు తీసుకెళ్లాడని, అక్కడ  తామిద్దరం పాలు తాగామని   కామెంట్స్  చేశాడు. ‘ది గ్రేడ్ క్రికెటర్’ అనే కార్యక్రమంలో అక్రమ్  మాట్లాడుతూ.. ‘ఆ ఘటనను తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు.  నేను అప్పుడు చాలా యంగ్ గా ఉన్నాను. అప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాను. ఓసారి మేం ఇంగ్లాండ్  టూర్ కు వెళ్లినప్పుడు అప్పటి సారథి ఇమ్రాన్ ఖాన్  నన్ను తన గదికి పిలిచి నైట్ పార్టీకి వెళ్దాం  రెడీ అవ్వు అన్నాడు.

77

నేను దానికి సరేనని వెళ్లాను. మేమిద్దరం లండన్ లోని కింగ్స్ క్రాస్  నై్ క్లబ్ కు వెళ్లాం. ఆ క్లబ్ లోపలికి వెళ్లగానే అక్కడ అందరూ  ఇమ్రాన్ ను గుర్తు పడుతున్నారు.  లోపల ఉన్న చాలా మంది అమ్మాయిలు ఇమ్రాన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. అదంతా నాకు వింతలా తోచింది. తర్వాత కొంతసేపటికి  ఇమ్రాన్ ఖాన్  తనతో పాటు నాక్కూడా కొన్ని పాలు  ఆర్డర్ చేశాడు.  తన లైఫ్ లో ఇమ్రాన్ ఖాన్ అప్పటివరకు పాలు తాగలేదట.    నైట్ క్లబ్ కు వెళ్లి మేమిద్దం పాలు తాగి వచ్చాం..’ అంటూ అప్పటి ఫన్నీ ఘటనను  గుర్తుచేసుకుని నవ్వులు  పూయించాడు అక్రమ్. 

About the Author

SM
Srinivas M
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved