- Home
- Sports
- Cricket
- Suryakumar Yadav: అతడు ప్రపంచస్థాయి ఆటగాడు.. బ్యాటర్లంతా అతడిని చూసి నేర్చుకోవాలి : కీరన్ పొలార్డ్
Suryakumar Yadav: అతడు ప్రపంచస్థాయి ఆటగాడు.. బ్యాటర్లంతా అతడిని చూసి నేర్చుకోవాలి : కీరన్ పొలార్డ్
Kieron Pollard Lauds Suryakumar Yadav: ఐపీఎల్ లో తన సహచరుడు సూర్యకుమార్ యాదవ్ పై విండీస్ సారథి కీరన్ పొలార్డ్ ప్రశంసలు కురిపించాడు. అతడు 360 డిగ్రీస్ ప్లేయర్ అని కొనియాడాడు.

టీమిండియా నయా ఫినిషర్ గా తయారవుతున్న సూర్యకుమార్ యాదవ్ పై వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ప్రశంసలు కురిపించాడు. అతడు 360 డిగ్రీ ప్లేయర్ అని.. సూర్యకుమార్ నుంచి ప్రతి ఆటగాడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని కొనియాడాడు.
ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా ముగిసిన మూడో టీ20 అనంతరం వర్చువల్ సమావేశంలో పాల్గొన్న పొలార్డ్.. ‘సూర్య ప్రపంచ స్థాయి ఆటగాడు. అతడితో కలిసి 2011 నుంచి (ముంబై ఇండియన్స్) ఆడుతున్నాను.
ఒక క్రికెటర్ గా సూర్య ఎదుగుదలను చూస్తున్నాను. వ్యక్తిగతంగా, టీమిండియా విజయాల కోసం అతడు చేస్తున్న కృషి, ఆడుతున్న తీరు అమోఘం.. సూర్య 360 డిగ్రీ ప్లేయర్. బ్యాటర్లంతా అతడిని చూసి నేర్చుకోవాలి. అతడి నుంచి స్ఫూర్తి పొందాలి..’ అని పొలార్డ్ చెప్పాడు.
వెస్టిండీస్ తో మూడు టీ20ల సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ మెరుగ్గా రాణించాడు. మూడు మ్యాచులలో కలిపి 53.50 సగటు, 194.55 స్ట్రైక్ రేట్ తో 107 పరుగులు చేశాడు.
ప్రత్యర్థులుగానే గాక ముంబై ఇండియన్స్ లో కూడా ఈ ఇద్దరూ సహచరులు. గతేడాది రిటెన్షన్ సందర్భంగా ముంబై ఇండియన్స్.. సూర్యకుమార్ యాదవ్ ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకోగా.. పొలార్డ్ ను రూ. 6 కోట్లతో దక్కించుకున్న విషయం తెలిసిందే.
వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో కూడా రాణించిన సూర్య.. భారత జట్టుకు ధోని తర్వాత ఫినిషర్ గా ఎదుగుతున్నాడు. వరుస మ్యాచులలో నిలకడగా రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో రాబోయే శ్రీలంకతో సిరీస్ లో కూడా అతడు రాణించాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు.