టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు.. తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
Tilak Varma World Record: అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ ఫీట్ రికార్డును సౌతాఫ్రికాతో సిరీస్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. ఇప్పుడు టీ20 క్రికెట్ లో వరుసగా సెంచరీల మోత మోగిస్తూ అరుదైన ఘనత సాధించాడు.
Tilak Varma
Tilak Varma World Record: టీమిండియా యంగ్ ప్లేయర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డుల మోత మోగిస్తున్నారు. భారత క్రికెట్ లో సంచలనాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టిన తిలక్ వర్మ.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఏ ప్లేయర్ సాధించని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Tilak Varma
టీ20 క్రికెట్‌లో భారత యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో వరుసగా 3 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. శనివారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ ఆడాడు. ఈ క్రమంలోనే అతను ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్ లో ఏ బ్యాట్స్‌మెన్ చేయలేని అద్భుతాన్ని చేశాడు. టీ20 క్రికెట్‌లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించి ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ రికార్డు సాధించాడు.
Tilak Varma
తిలక్ వర్మ ప్రపంచ రికార్డు
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో శనివారం మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 67 బంతుల్లో ఏకంగా 151 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ ను 225.37 స్ట్రైక్ రేట్‌తో కొనసాగించిన తిలక్ వర్మ 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇది వరుసగా మూడో సెంచరీ. ఇంతకుముందు, తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. తిలక్ వర్మ ఈ నెలలో సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు.
Tilak Varma
తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ వివరాలు ఇలా ఉన్నాయి
తిలక్ వర్మ వరుసగా చివరి మూడు టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించాడు. ఇందులో రెండు విదేశాల్లో, ఒకటి భారత గడ్డపై కొట్టాడు.
107* పరుగులు (56 బంతులు) - వర్సెస్ సౌతాఫ్రికా, సెంచూరియన్
120* పరుగులు (47 బంతులు) - vs సౌతాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్
151 పరుగులు (67 బంతులు) - vs మేఘాలయ, రాజ్‌కోట్
Tilak Varma
మరో సూపర్ రికార్డు సాధించిన తిలక్ వర్మ
టీ20 క్రికెట్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా తిలక్ వర్మ నిలిచాడు. అదే సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్ చరిత్రలో అతిపెద్ద వ్యక్తిగత ఇన్నింగ్స్ ఆడిన రికార్డును కూడా తిలక్ వర్మ సృష్టించాడు. తిలక్ వర్మ కంటే ముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 2019లో సిక్కింపై 147 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు తిలక్ వర్మ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 151 పరుగుల రికార్డు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.