MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: హ‌ర్షిత్ రాణా అదిరిపోయే ఎంట్రీ.. తొలి భారత బౌలర్‌గా కొత్త రికార్డు

IND vs ENG: హ‌ర్షిత్ రాణా అదిరిపోయే ఎంట్రీ.. తొలి భారత బౌలర్‌గా కొత్త రికార్డు

Harshit Rana: భారత పేస‌ర్ హర్షిత్ రాణా చ‌రిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ పై వన్డేల్లో అరంగేట్రం చేస్తూ సూపర్ బౌలింగ్ తో 3 వికెట్లు పడగొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 07 2025, 07:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Harshit Rana

Harshit Rana

Harshit Rana: టీమిండియా పేస‌ర్ హ‌ర్షిత్ రాణా ప్ర‌స్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఇటీవ‌ల టీ20 సిరీస్ లో సూపర్ బౌలింగ్ తో త‌న ఎంట్రీ ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేసిన హ‌ర్షిత్ రాణా.. వ‌న్డే సిరీస్ లో కూడా అదే ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో అద్భుత బౌలింగ్ తో భార‌త్ కు విక్ట‌రీ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Harshit Rana-Phil Salt

Harshit Rana-Phil Salt

మూడు ఫార్మాట్లు.. తొలి భార‌త బౌల‌ర్ గా హ‌ర్షిత్ రాణా రికార్డు

ప్ర‌స్తుతం భార‌త్-ఇంగ్లాండ్ జ‌ట్టు మూడు మ్యాచ్ ల వ‌న్డే సిరీస్ ను ఆడుతున్నాయి. దీనిలో భాగంగా తొలి మ్యాచ్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ తొలి వన్డేలో హ‌ర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. ఇక్క‌డ కూడా అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. 

ఇదే స‌మ‌యంలో అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో అరంగేట్రంలోనే మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా హర్షిత్ రాణా నిలిచాడు. తన వన్డే అరంగేట్ర ఇన్నింగ్స్‌లో హర్షిత్ రాణా 7 ఓవర్ల బౌలింగ్ లో 53 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ 7 ఓవ‌ర్ల‌లో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండ‌టం విశేషం.

35
Image Credit: Getty Images

Image Credit: Getty Images

ఇంగ్లాండ్ ను దెబ్బ‌కొట్టిన హ‌ర్షిత్ రాణా

తొలి వ‌న్డే మ్యాచ్ లో భార‌త్ విజ‌యంలో హ‌ర్షిత్ రాణా కీల‌క పాత్ర పోషించాడని చెప్పాలి. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్.. హ‌ర్షిత్ రాణా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. తన మూడవ ఓవర్‌లో 26 పరుగులు చేసి చెత్త రికార్డును రాణా పేరుమీద వేశాడు. అయితే, వన్డే కెరీర్ సవాలుతో ప్రారంభం కాగా, ఆ త‌ర్వాత హ‌ర్షిత్ రాణా త‌న బౌలింగ్ ప‌దును చూపించాడు. మొద‌టి మూడు ఓవ‌ర్ల‌లో 37 పరుగులు ఇచ్చాడు కానీ, ఆ త‌ర్వాత త‌న బౌలింగ్ ప‌వ‌ర్ చూపించాడు. త‌ర్వాతి 4 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

45
Image Credit: Getty Images

Image Credit: Getty Images

టీ20లో శివం దూబే స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన హ‌ర్షిత్ రాణా 

వ‌న్డే ఎంట్రీకి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గో T20Iలో శివమ్ దుబేకు బదులుగా హర్షిత్ భారత జట్టులోకి వ‌చ్చాడు. ఇది అత‌నికి అరంగేట్రం మ్యాచ్. ఈ మ్యాచ్ లో కూడా సూపర్ బౌలింగ్ తో 3 వికెట్లు తీసి దుమ్మురేపాడు. 4-0-33-3 గణాంకాలను నమోదు చేశాడు.

దీనికి ముందు 2024-25లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో హ‌ర్షిత్ రాణా టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇక్క‌డ కూడా సూప‌ర్ బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. రాణా మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

55
Image Credit: Getty Images

Image Credit: Getty Images

అద్భుతంగా అంత‌ర్జాతీయ కెరీర్ ను మొద‌లుపెట్టిన హ‌ర్షిత్ రాణా

23 ఏళ్ల హ‌ర్షిత్ రాణా అంతర్జాతీయ కెరీర్ ను అద్భుతంగా ప్రారంభించాడు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను రెండు టెస్టులు, ఒక టీ20, ఒక వ‌న్డే మ్యాచ్ ను ఆడాడు. అతని టెస్ట్ రికార్డు 50.75 సగటుతో నాలుగు వికెట్లు ఉండ‌గా, అందులో 3/48 అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.

ఒక టీ20 మ్యాచ్ లో 11.00 సగటుతో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వ‌న్డే అరంగేట్రం మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. అతని లిస్ట్-ఏ కెరీర్ లో 14 మ్యాచ్‌లలో 23.45 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు.  ఇందులో 4/17 అత్యుత్తమ గణాంకాలు ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: గౌతమ్ గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్.. అసలు కారణం ఇదే
Recommended image2
T20 Cricket Centuries: టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన టాప్ 7 బ్యాటర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Hardik Pandya: అఫ్గానిస్తాన్‌తో T20I సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు ఎంపిక కాలేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved