అతనొక్కడూ ఫామ్‌లో ఉంటే చాలు, వరల్డ్ కప్ గెలిచేస్తారు... టీమిండియాపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్...
ఆసియా కప్ 2023 టైటిల్ విజేతగా నిలిచిన భారత జట్టు, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా మారిపోయింది. 10 ఏళ్లుగా ప్రపంచ కప్ గెలవలేకపోయిన భారత జట్టు, ఈసారి మాత్రం కప్పు మిస్ చేయదని గట్టిగా ఫిక్స్ అయ్యారు చాలా మంది ఫ్యాన్స్..
2013లో ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత 10 ఏళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఫార్మాట్లు మారినా, కెప్టెన్లు మారినా, హెడ్ కోచ్‌లు తారుమారు అయినా ఐసీసీ టైటిల్ మాత్రం రావడం లేదు..
ధోనీ కెప్టెన్సీలో 2014, 2016 టీ20 వరల్డ్ కప్స్, 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయిన భారత జట్టు, విరాట్ కోహ్లీ సారథ్యంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 టోర్నీల్లో విఫలమైంది..
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ సారథ్యంలోనూ 2022 టీ20 వరల్డ్ కప్, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచుల్లో చిత్తుగా ఓడింది భారత జట్టు. ఇప్పుడు ఆశలన్నీ 2023 వన్డే వరల్డ్ కప్‌పైనే ఉన్నాయి..
‘హార్ధిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే, టీమిండియా, వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలవకుండా ఆపడం చాలా కష్టం. ఎందుకంటే భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో హార్ధిక్ పాండ్యా కీ బ్యాటర్. అలాగే బౌలింగ్‌లోనూ అతనే ఎక్స్ ఫ్యాక్టర్ అవుతాడు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వికెట్లు రాబట్టగల బౌలర్ మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలడు..
Ben Stokes
ఇంగ్లాండ్‌కి బెన్ స్టోక్స్, కీ ప్లేయర్ అవుతాడు. బెన్ స్టోక్స్, రీఎంట్రీ ఇవ్వకపోయి ఉంటే నేను, ఇంగ్లాండ్‌ని వరల్డ్ కప్ ఫెవరెట్స్‌గా పరిగణించేవాడిని కాదు. ఆస్ట్రేలియాకి కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ కీ ప్లేయర్లు అవుతారు..
Ben Stokes
ఎలాంటి పిచ్ మీద అయినా బ్యాటింగ్ చేయగలగడం, వికెట్లు తీయడం ఈ ప్లేయర్ల ప్రత్యేకత. అలాగే వరల్డ్ కప్ ఆడే చాలా టీమ్స్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే హార్ధిక్, బెన్ స్టోక్స్, స్టోయినిస్ లాంటి ప్లేయర్లు, మ్యాచ్ విన్నర్లుగా మారతారు..
Rahul Dravid-Hardik Pandya
గత ఏడాది రాహుల్ ద్రావిడ్ ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో మేం ఫియర్‌లెస్ క్రికెట్ ఆడాలని అనుకుంటున్నామని కామెంట్ చేశాడు. వాళ్లు ద్వైపాక్షిక సిరీసుల్లో అదరగొడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ దాకా వచ్చారు.
ఈసారి స్వదేశంలో వరల్డ్ కప్ ఆడబోతుండడం టీమిండియాకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ వ్యూహాలకు పదును చెప్పే సమయం వచ్చేసింది.. ఈసారి గెలవలేకపోతే, టీమిండియా చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్..