MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • స్కానింగ్‌కి హార్ధిక్ పాండ్యా... సబ్‌స్టిట్యూట్‌గా తెచ్చేందుకు సరైన ఆల్‌రౌండర్‌ కూడా లేకపాయే...

స్కానింగ్‌కి హార్ధిక్ పాండ్యా... సబ్‌స్టిట్యూట్‌గా తెచ్చేందుకు సరైన ఆల్‌రౌండర్‌ కూడా లేకపాయే...

పూణేలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా గాయపడ్డాడు. తన బౌలింగ్‌లో తన్జీద్ హాసన్ కొట్టిన షాట్‌ని ఆపేందుకు ప్రయత్నించిన హార్ధిక్ పాండ్యా, అతని తప్పి పడిపోయాడు. ఎడమ అరకాలిపై బరువు పడడంతో బెణికింది. 

Chinthakindhi Ramu | Published : Oct 19 2023, 04:13 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

ఫిజియో చికిత్స తర్వాత బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించినా వీలుకాకపోవడంతో అతని ఓవర్‌ని విరాట్ కోహ్లీ పూర్తి చేశాడు.. హార్ధిక్ పాండ్యా గాయం తీవ్రత తేల్చేందుకు అతన్ని స్కానింగ్‌కి పంపించారు.

26
Asianet Image

గాయం కారణంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో హార్ధిక్ ఫీల్డింగ్‌కి కానీ, బౌలింగ్‌కి రాడని తేలిపోయింది. బ్యాటింగ్‌కి అయినా వస్తాడా? రాడా? అనే విషయంపై క్లారిటీ రాలేదు. గాయం తీవ్రమైనదైతే, హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కి రావడం కూడా కష్టమే..

36
Asianet Image

హార్ధిక్ పాండ్యా గాయపడితే అతని ప్లేస్‌లో టీమ్‌లోకి తెచ్చేందుకు సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా టీమ్‌కి అందుబాటులో లేకపోవడం టీమిండియా సెలక్షన్‌లో డొల్లతనానికి నిదర్శనం. హార్ధిక్ పాండ్యాతో పాటు శార్దూల్ ఠాకూర్‌ని ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లుగా వరల్డ్ కప్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు..

46
Asianet Image

శార్దూల్ ఠాకూర్ కూడా తుది జట్టులో ఉన్నాడు. కాబట్టి కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా తుది జట్టులో తీసుకురావాలని టీమిండియా అనుకున్నా, రిజర్వు బెంచ్‌లో సరైన రిప్లేస్‌మెంట్ ప్లేయర్ లేడు.  ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్‌లు ప్రస్తుతం రిజర్వు బెంచ్‌లో ఉన్నారు..

56
Suryakumar Yadav

Suryakumar Yadav

ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ అయితే, సూర్యకుమార్ యాదవ్ పక్కా బ్యాటర్. మహ్మద్ షమీ ఫాస్ట్ బౌలర్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. కాబట్టి ఐసీసీ నిబంధనల ప్రకారం హార్ధిక్ పాండ్యా ప్లేస్‌లో వీరిలో ఎవరినైనా తుది జట్టులోకి తీసుకురావడం అయ్యే పని కాదు..

66
Hardik_Rohit

Hardik_Rohit

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కాబట్టి హార్ధిక్ పాండ్యా వరకూ బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోవచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఒకవేళ సెమీస్‌లో, కీ మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితి వస్తే, టీమిండియా గతేంటి? అని నిలదీస్తున్నారు ఫ్యాన్స్..

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories