MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Hardik Pandya: ప్రపంచంలో కేవలం 50 మాత్ర‌మే ఉన్నాయి..హార్దిక్ వాచ్ ధ‌ర 7 కోట్లా !

Hardik Pandya: ప్రపంచంలో కేవలం 50 మాత్ర‌మే ఉన్నాయి..హార్దిక్ వాచ్ ధ‌ర 7 కోట్లా !

Hardik Pandya: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా రూ. 7 కోట్ల విలువైన వాచ్ (చేతి గడియారం) అందరి దృష్టిని ఆకర్షించింది. ఏంటి ఆ వాచ్ ప్ర‌త్యేక‌త‌? 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2025, 09:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

Hardik Pandya wrist watch: పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీ తన సూప‌ర్ అజేయ సెంచరీతో టీమిండియా అద్భుత విజ‌యం సాధించింది. ఈ విజ‌యంతో భార‌త్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌కు చేరుకుంది. ఎంతో ఉత్కంఠ‌గా ఎదురుచూసిన ఈ మ్యాచ్ లో భార‌త‌ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. దీనికి ప్ర‌ధాన కార‌ణం అత‌ను ధ‌రించిన చేతి గ‌డియారం (వాచ్). ఆ వాచ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తోంది. అస‌లు ఈ వ్యాచ్ ప్ర‌త్యేక‌త ఏంటి? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Hardik Pandya

Hardik Pandya

హ‌ర్దిక్ పాండ్యాకు ల‌గ్జ‌రీ వాచ్ లు అంటే చాలా ఇష్టం

భార‌త జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ హ‌ర్దిక్ పాండ్యాకు ల‌గ్జ‌రీ వాచ్ లు అంటే చాలా ఇష్టం. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ లో హ‌ర్దిక్ పాండ్యా తన క్లాసిక్ వాచ్ కలెక్షన్లలో ఒక‌దానిని పెట్టుకుని క‌నిపించాడు. 

పాకిస్తాన్ ఓపెనర్ బాబర్ అజామ్‌ను అవుట్ చేసిన తర్వాత హ‌ర్దిక్ పాండ్యా ఉత్సాహంగా సెల‌బ్రేట్ చేసుకుంటుండ‌గా అతని రిచర్డ్ మిల్లె RM 27-02 CA FQ టూర్‌బిల్లాన్ రాఫెల్ నాదల్ స్కెలిటన్ డయల్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

అతని చేతికి మెరిసే స్టైలిష్ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దాని గురించి నెట్టింట వేతికి దాని ధర చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది వంద‌లు వేలు కాదు.. ల‌క్ష‌ల వాచ్ కూడా కాదు.. దాని ధ‌ర కోట్లలో ఉంటుంది. అది 'రిచర్డ్ మిల్లె' కంపెనీకి చెందినది.

33
Kuldeep Hardik

Kuldeep Hardik

హార్దిక్ ధ‌రించిన వాచ్ లు ప్రపంచంలో 50 మాత్ర‌మే ఉన్నాయి ! 

ఈ చేతి గడియారం ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారులు క్రిస్టియానో ​​రొనాల్డో, రాఫెల్ నాదల్ చేతుల‌కు కూడా క‌నిపించింది. హార్దిక్ పాండ్యా ధ‌రించిన వాచ్ దానికంటూ ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు, డిజైన్ ను క‌లిగి ఉంటుంది. గొప్ప‌ డిజైన్ మాత్రమే కాదు.. ఇది లిమిటెడ్ ఎడిష‌న్. ప్రపంచవ్యాప్తంగా కేవ‌లం 50 మాత్ర‌మే ఉన్నాయి. అందుకే దీనిని ధరించాలనేది చాలా మంది ఔత్సాహికుల కల అవుతుంది.

ఈ గడియారం కలర్ ఫుల్ ఎలాస్టిక్ బ్యాండ్‌తో, ప్రత్యేకమైన తెల్లటి క్వార్ట్జ్ కేసును కలిగి ఉంటుంది. దీంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెల్లని క్వార్ట్జ్ బెజెల్, సిల్వర్-టోన్ చేతులు, ఇండెక్స్ మార్కర్లతో కూడిన సొగసైన నలుపు డయల్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వాచ్ లో రిచర్డ్ మిల్లె కాలిబర్ CRMA7 ఆటోమేటిక్ మూవ్‌మెంట్ ఉంది. దీనిపై ఎలాంటి గీతలు కూడా ప‌డ‌వు. ఈ వాచ్ ప్రారంభ ధ‌ర ఒక కోటి రూపాయ‌ల నుంచి రూ. 7 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved