- Home
- Sports
- Cricket
- Hardik Pandya: టీమిండియా కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేయనున్న గుజరాత్ సారథి..? రాహుల్ ఒక్క సిరీస్ కే పరిమితం..
Hardik Pandya: టీమిండియా కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేయనున్న గుజరాత్ సారథి..? రాహుల్ ఒక్క సిరీస్ కే పరిమితం..
IPL 2022: టీమిండియా ఆల్ రౌండర్, ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను విజయవంతంగా నడిపిస్తున్న హార్ధిక్ పాండ్యా త్వరలోనే భారత జట్టుకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడని సమాచారం.

గుజరాత్ టైటాన్స్ సారథి త్వరలోనే భారత జట్టు కు నాయకుడిగా మారబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఐపీఎల్-15లో అతడి ప్రదర్శనతో సంతృప్తి చెందిన సెలెక్టర్లు.. టీమిండియా నాయకత్వ పగ్గాలను కూడా అతడికి అప్పజెప్పనున్నట్టు సమాచారం.
ఐపీఎల్-15 ముగిసిన తర్వాత భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్ కు కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
Photo source- iplt20.com
కాగా ఈ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ ఐర్లాండ్ తో జూన్ 26, 28న రెండు టీ20 లు ఆడనుంది. ఈ సిరీస్ కు హార్ధిక్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తాడని సమాచారం.
ఇన్సైడ్ స్పోర్ట్స్ కథనం మేరకు.. ఐర్లాండ్ సిరీస్ కు హార్ధిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసే అవకాశముంది. ఈ మేరకు బీసీసీఐ కూడా పాండ్యా పనితీరుపై సంతృప్తిగా ఉంది.
ఇదే విషయమై సెలెక్షన్ కమిటీకి చెందిన ఓ సభ్యుడు మాట్లాడుతూ.. ‘హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ లో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఆటగాడి కంటే సారథిగా కూడా అతడు ఆకట్టుకుంటున్నాడు. ఐర్లాండ్ టూర్ కు వెళ్లే భారత జట్టుకు అతడు కెప్టెన్ గా ఉండే అవకాశముంది..’ అని చెప్పాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక కెఎల్ రాహుల్ తో పాటు వికెట్ కీపర్ రిషభ్ పంత్ లు ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు ఆడేందుకు బయల్దేరుతారు. అయితే ఐర్లాండ్ టూర్ కు కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాను గానీ భువనేశ్వర్ ను గానీ నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
అయితే భువీ కంటే పాండ్యా ను ఎంపిక చేసిందే బెటరనే భావనలో సెలెక్టర్లు ఉన్నారు. ఐపీఎల్-15లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను అద్భుతంగా నడిపించిన పాండ్యా.. ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు. బ్యాటర్ గా తాను కూడా గతంలో కంటే మెరుగయ్యాడు. ఈ సీజన్ లో అతడు 14 మ్యాచులాడి 45.30 సగటుతో 453 పరుగులు చేశాడు.