MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 : ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకే ఇప్పుడతడు కెప్టెన్.. ఇంతటి తోపు ఎవరో తెలుసా..?

IPL 2026 : ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్లకే ఇప్పుడతడు కెప్టెన్.. ఇంతటి తోపు ఎవరో తెలుసా..?

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. T20 ప్రపంచకప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ వంటి సహచరులను మేనేజ్ చేస్తూ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన ఒత్తిడి అతడిపై ఉంది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 26 2026, 12:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హార్దీక్ పాండ్యాకు ఈ ఐపిఎల్ అగ్నిపరీక్షే...
Image Credit : Getty

హార్దీక్ పాండ్యాకు ఈ ఐపిఎల్ అగ్నిపరీక్షే...

స్టార్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కాదని పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించింది అంబానీ కుటుంబం. కానీ గత రెండు సీజన్లలో పాండ్యా సారథ్యంలోని ముంబై టీం చెత్త  ప్రదర్శన కనబర్చింది. 

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పాండ్యాకు ఇది వరుసగా ఐదో సీజన్. గతంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాను ఏరికోరి జట్టులోకి తీసుకువచ్చింది ఏంఐ యాజమాన్యం. అంతేకాదు ఐదుసార్లు ఐపిఎల్ టైటిల్ గెలిపించిన రోహిత్ శర్మ ను పక్కనబెట్టి హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది.  

పాండ్యా కెప్టెన్స్ గా వ్వవహరించిన మొదటి సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌లలో 4 విజయాలతో పట్టికలో 10వ స్థానంలో నిలిచింది. ఇక గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరినా, క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ఇలా వరుస సీజన్లలో విఫలమైన పాండ్యాకు రాబోయే సీజన్ ఒక అగ్నిపరీక్ష లాంటిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబై టీంలోనే ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్...
Image Credit : Getty

ముంబై టీంలోనే ఇద్దరు టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్...

2022 ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా సక్సెస్ అయ్యాక హార్దిక్ పాండ్యా టీమిండియా T20లకు నాయకత్వం వహించాడు… కానీ పూర్తిస్థాయి కెప్టెన్ గా అవకాశం దక్కలేదు. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో ఇలాంటి సవాలే ఎదురవుతోంది. 

ఐపీఎల్ 2025లో డ్రెస్సింగ్ రూమ్‌లో T20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు తాజా టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టులో ఉన్నాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన జట్లలో హార్దిక్ ఉన్నప్పటికీ, ఇప్పుడు ఇద్దరు సక్సెస్‌ఫుల్ కెప్టెన్లను మేనేజ్ చేస్తూ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో వ్యూహాలను ప్రభావితం చేయగలడు. ఈ స్టార్ ఆటగాళ్లందరినీ బ్యాలెన్స్ చేయడం హార్దిక్‌కు చాలా ముఖ్యం.  

35
MI కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్
Image Credit : Getty

MI కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ ఇటీవల టీమిండియాను టీ20 ప్రపంచకప్‌లో విజయపథంలో నడిపించాడు. మార్చి 8న జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టాడు. కానీ ఇప్పుడు అతను కెప్టెన్‌గా కాకుండా, హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఒక ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. ఇది డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక కొత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది.

టీ20 ప్రపంచకప్ గెలిచిన తన సహచరుడిని మేనేజ్ చేస్తూ, తన కెప్టెన్సీని నిలబెట్టుకోవడం ఈ సీజన్‌లో హార్దిక్‌కు కష్టమైన సవాల్. ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి పట్టు ఉంటుంది. మాజీ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, క్రిస్ శ్రీకాంత్ కూడా సూర్యకుమార్‌ను ముంబై కెప్టెన్ చేయాలని సూచించిన విషయం తెలిసిందే.

45
ముంబై ఈసారైనా ట్రోఫీ గెలుస్తుందా..?
Image Credit : Getty

ముంబై ఈసారైనా ట్రోఫీ గెలుస్తుందా..?

ముంబై ఇండియన్స్ గత ఐదు సీజన్లుగా ట్రోఫీ గెలవలేదు. ఐపీఎల్ చరిత్రలో ఫ్రాంచైజీకి ఇదే సుదీర్ఘ టైటిల్ కరవు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా సాధించిన విజయాన్ని హార్దిక్ ముంబైలో పునరావృతం చేయలేకపోతున్నాడు. అతని కెప్టెన్సీలో గత రెండు సీజన్లలో ముంబై ప్రదర్శన మిశ్రమంగా ఉంది. జట్టు గెలుపు శాతం 44.82గా నమోదైంది. అందుకే 2026 సీజన్ అతని నాయకత్వానికి కీలక పరీక్ష. ఆటగాడిగా హార్దిక్ ఐపీఎల్ టైటిళ్లు గెలిచి ఉండొచ్చు, కానీ కెప్టెన్‌గా ముంబైకి కప్ అందించి తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం ఇది. లేదంటే కెప్టెన్సీ పగ్గాలు చేజారే అవకాశాలున్నాయి.

55
ఈసారి విఫలమైతే హార్దిక్ కు కష్టమే..
Image Credit : Getty

ఈసారి విఫలమైతే హార్దిక్ కు కష్టమే..

ఐపీఎల్ 2024 లో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.. అప్పటినుండి ముంబై అభిమానుల దృష్టిలో విలన్‌గా మారాడు. వాంఖడే స్టేడియంతో సహా ప్రతీచోట ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగలడా అని అభిమానులు ప్రశ్నించారు. 

అయితే 2024 T20 ప్రపంచకప్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన, గత సీజన్‌లో ముంబైని ప్లేఆఫ్స్‌కు చేర్చడంతో తిరిగి గౌరవాన్ని సంపాదించుకున్నాడు. అయినప్పటికీ, హార్దిక్ పాండ్యా ఐదేళ్ల నిరీక్షణకు తెరదించి, ఫ్రాంచైజీకి టైటిల్ అందించగలడా అనే సందేహం అభిమానుల్లో ఇంకా ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
భారత జాతీయ క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Recommended image2
IPL 2026: అయ్యబాబోయ్.. ముంబై.! టీమిండియా తోపులందరూ జట్టులోనే.. ఆరో కప్పు లోడింగ్.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved