నా కెప్టెన్సీ సక్సెస్‌కు కారణం అతడే.. హార్ధిక్ పాండ్యా కామెంట్స్
INDvsSL:గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తనను రిలీజ్ చేసిన తర్వాత హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు మళ్లాడు. ఆ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి ప్రయత్నంలోనే గుజరాత్ కు టైటిల్ అందించాడు.

స్వదేశంలో కొత్త ఏడాదిని టీమిండియా ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో నిన్న ముగిసిన మూడో టీ20లో భారత జట్టు భారీ విజయాన్ని అందుకుని సిరీస్ ను 2-1 తేడాతో విజయం సాధించింది. రోహిత్ వారసుడిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్ గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ విజయం.
Image credit: PTI
గతేడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తనను రిలీజ్ చేసిన తర్వాత హార్ధిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కు మళ్లాడు. ఆ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి ప్రయత్నంలోనే గుజరాత్ కు టైటిల్ అందించాడు. అయితే అంతకుముందు కెప్టెన్ గా పెద్దగా అనుభవం లేని పాండ్యా.. ఐపీఎల్ లో మాత్రం అదరగొట్టాడు. ఆ సక్సెస్ తోనే టీమిండియా మేనేజ్మెంట్.. టీ20 ప్రపంచకప్ లో రోహిత్ సేన వైఫల్యం తర్వాత హిట్ మ్యాన్ వారసుడిగా హార్ధిక్ తో మిషన్ - 2024 ను ప్రయోగిస్తున్నది.
తన కెప్టెన్సీ సక్సెస్ కు గల కారణం గుజరాత్ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రానే అంటున్నాడు పాండ్యా. శ్రీలంకతో చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఇదే విషయమై మాట్లాడుతూ.. ‘గుజరాత్ టైటాన్స్ గా నేను సక్సెస్ అవడానికి ఇప్పుడు దానిని కొనసాగించడానికి కారణం ఆశిష్ నెహ్రా...
నెహ్రా నా జీవితంలో నేను ఊహించని మార్పులను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఒకే మైండ్ సెట్ తో ఉండే వేర్వేరు వ్యక్తులం. అతడు నాతో ఉండటం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. నాకు తెలిసిన వాటిని సరిగ్గా పొందడానికి అది నాకు తోడ్పడింది. ఈ ఆట గురించి నాకు తెలుసు. ఆటగాళ్లను నమ్మడం కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నా.
జూనియర్ లెవల్ లో నేను ఎప్పుడూ నాయకత్వం వహించలేదు. అండర్ -16 టీమ్ లో ఉన్నప్పుడు బరోడాకు సారథిగా ఉన్నాను. కానీ ఆ తర్వాత నా ఆట మీదే దృష్టినిలిపాను తప్ప కెప్టెన్సీ వైపు ఆలోచించలేదు...’ అని పాండ్యా తెలిపాడు.
ఇక శ్రీలంకతో సిరీస్ లో సూర్య, అక్షర్ పటేల్ ల ప్రదర్శనపై హార్ధిక్ పాండ్యా ప్రశంసలు కురిపించాడు. ప్రతీ ఇన్నింగ్సష్ లోనూ సూర్యకుమార్ ఆట ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని .. ఒకవేళ తాను గనక అతడికి బౌలింగ్ చేయాల్సి వస్తే చాలా బాధపడతానని అన్నాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించడం తనను గర్వపడేలా చేసిందని పాండ్యా చెప్పాడు.