పోలార్డ్ తర్వాత హార్ధిక్ పాండ్యా... సరికొత్త రికార్డు నెలకొల్పిన భారత ఆల్‌రౌండర్...
First Published Dec 7, 2020, 5:26 PM IST
హార్ధిక్ పాండ్యా భారీ సిక్సర్లు కొట్టడం ఇప్పుడే కొత్త కాదు. ఐపీఎల్‌లో సిక్సర్ల మోత కారణంగానే హార్ధిక్ పాండ్యాకి భారత జట్టులో స్థానం దక్కింది. అయితే ముంబై ఇండియన్స్‌కి ఆడిన ఇన్నింగ్స్‌లతో పోలిస్తే, టీమిండియా తరుపున ఇన్నాళ్లు పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయాడు హార్ధిక్ పాండ్యా. అదీకాకుండా పాండ్యాను గాయాలు వెంటాడాయి. అయితే ఇప్పుడు సీన్ మారింది. తండ్రి అయిన తర్వాత కూల్ అండ్ కామ్‌గా తయారైన హార్ధిక్ పాండ్యా, ఆసీస్ టూర్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.

ఆస్ట్రేలియాలో ఒకే టూర్‌లో వన్డే, టీ20 సిరీస్ రెండింటిలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలచుకున్న రెండో క్రికెటర్‌గా నిలిచాడు హార్ధిక్ పాండ్యా. 2013లో కిరన్ పోలార్డ్ ఈ ఘనత సాధిస్తే, 2020లో హార్ధిక్ పాండ్యా మూడో వన్డేలో, రెండో టీ20లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

మూడు దేశాలపై మూడు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలిచిన మొట్టమొదటి కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై స్వదేశంలోనూ, విదేశంలోనూ టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను గెలిచి సరికొత్త చరిత్ర లిఖించాడు విరాట్...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?