- Home
- Sports
- Cricket
- ఫామ్‌లో ఉన్న వాళ్లనే ఆడిస్తాం... కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్, విరాట్ కోహ్లీ గురించేనా...
ఫామ్‌లో ఉన్న వాళ్లనే ఆడిస్తాం... కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్, విరాట్ కోహ్లీ గురించేనా...
కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అపజయం అనే పదానికి అర్థమే తెలియనట్టుగా, వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ వెళ్తున్నాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌తో టీ20, విండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు, లంకతో టెస్టు సిరీస్‌కి సిద్ధమవుతోంది...

శ్రీలంకతో టీ20 సిరీస్‌కి ఎంపికైన సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడంతో శ్రేయాస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు దక్కింది...
మూడో మ్యాచుల్లోనూ వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో రికార్డు క్రియేట్ చేశాడు...
మూడుకి మూడు మ్యాచుల్లోనూ నాటౌట్‌గా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు...
సూర్యకుమార్ యాదవ్ కోలుకుంటే, శ్రేయాస్ అయ్యర్‌ను ఆడిస్తారా? ఆడిస్తే ఏ స్థానంలో ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది...
విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన సూర్యకుమార్ యాదవ్‌ని పక్కనబెట్టే సాహసం చేయకపోవచ్చు...
‘ప్లేయర్లు రాణిస్తుండడం టీమ్‌కి మంచిదే. తుది జట్టుకి సెలక్ట్ చేయడం మరింత కష్టంగా మారొచ్చు. అయితే ఫామ్‌లో లేని వాళ్లకంటే ఫామ్‌లో ఉన్నవారిని ఆడిస్తే రిజల్ట్ బాగుంటుంది కదా...’ అంటూ కామెంట్ చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ...
ఈ వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఫెయిలైన కోహ్లీ, ఆ తర్వాత టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో ఓ హాఫ్ సెంచరీ బాదాడు...
రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నా, హాఫ్ సెంచరీలు చేస్తూ రోహిత్ శర్మ కంటే మెరుగైన ప్రదర్శనే ఇస్తున్నాడు విరాట్ కోహ్లీ...
అయితే విరాట్ కోహ్లీ గైర్హజరీలో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ కూడా మూడో స్థానంలో రాణించి, ఆకట్టుకున్నవాళ్లే... కోహ్లీని తప్పించి, ఆ స్థానంలో సూర్యకు అవకాశం ఇవ్వాలని రోహిత్ ఫ్యాన్స్ డిమాండ్ కూడా చేశారు...
ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఈ ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
అయితే రోహిత్ వ్యాఖ్యల్లో ఎలాంటి ఉద్దేశం లేదని, ఫామ్‌లో ఉన్న ప్లేయర్లను ఆడిస్తామని చెప్పినంత మాత్రం విరాట్‌ను పక్కనబెడతామని చెప్పినట్టు కాదని అంటున్నారు టీమిండియా అభిమానులు...
ఫామ్ గురించి మాట్లాడితే కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మ ఫామ్ ఎలా ఉందో చూసుకోవాలని, విండీస్‌తో టీ20 సిరీస్‌లో, శ్రీలంకతో టీ20 సిరీస్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్ ఫామ్ గురించి మాట్లాడడం వింతగా ఉందని అంటున్నారు విరాట్ ఫ్యాన్స్...