- Home
- Sports
- Cricket
- ఆశీష్ నెహ్రా సక్సెస్ సీక్రెట్ ఇదే, అందుకే బెస్ట్ కోచ్ అయ్యాడు... గ్యారీ కిర్‌స్టన్...
ఆశీష్ నెహ్రా సక్సెస్ సీక్రెట్ ఇదే, అందుకే బెస్ట్ కోచ్ అయ్యాడు... గ్యారీ కిర్‌స్టన్...
ఐపీఎల్ 2022 సీజన్‌ని ఏ మాత్రం అంచనాలు లేకుండా టైటిల్ గెలిచి అద్భుతాలు చేసింది గుజరాత్ టైటాన్స్. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రాని ప్రకటించినప్పుడే గుజరాత్ టైటాన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్‌లో ఉంటుందని అంచనా వేశారు క్రికెట్ ఫ్యాన్స్, ఎక్స్‌పర్ట్స్. అయితే రిజల్ట్ మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వచ్చింది...

Image Credit: PTI
ఆరంగ్రేటం సీజన్‌లోనే టైటిల్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసింది గుజరాత్ టైటాన్స్. టైటాన్స్ జోరు వల్ల మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ ఆఖరి స్థానాల్లో నిలవాల్సి వచ్చింది...
క్రీజులో చాలా కూల్ అండ్ కామ్‌గా తిరుగుతూ... కొబ్బరి బొండాం తాగుతూ ఛిల్ అవుతూ కనిపించిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా, ఐపీఎల్ టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు...
గ్యారీ కిర్‌స్టన్ కోచింగ్‌లో 2011 వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఆశీష్ నెహ్రా, 2018-19 సీజన్‌లో బౌలింగ్ కోచ్‌గా కిర్‌స్టన్‌తో కలిసి ఆర్‌సీబీకి పనిచేశాడు...
‘ఆశీష్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేం ఇద్దరం కలిసి చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాం. అతను ఆటను అర్థం చేసుకునే విధానం, అతని ప్రొఫెషనలిజం, ధైర్యాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను...
అతను ప్లేయర్లను, వాళ్ల ఆలోచనలను అర్థం చేసుకుంటాడు. అందుకే వారి ఏ సాయం కావాలో కనిపెట్టి, మనసుతో వాటిని పరిష్కరించాడు. ఓ రకంగా చెప్పాలంటే అతను మనసున్న కోచ్...
నెహ్రా ఎప్పుడూ స్పాట్ లైట్‌లో ఉండడానికి ఇష్టపడడు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. అయితే వ్యూహాలు రచించడంలో మాత్రం బెస్ట్ కోచ్‌లలో ఒకడు...
హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రా ఉండడంతో నా పని చాలా తేలికైపోయింది. మెంటర్‌గా ఈ సీజన్‌ని బాగా ఎంజాయ్ చేశా. ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే భారత ప్లేయర్లు బలంగా ఉండాలి...
Image credit: PTI
ఎందుకంటే ఇక్కడ ఆడే ప్లేయర్లలో 85 శాతం మందికి హిందీ మాత్రమే అర్థమవుతుంది. వారి భాషలో మాట్లాడుతూ వారి నుంచి పర్ఫామెన్స్ రాబట్టగలగాలంటే భారత కెప్టెన్ అయితేనే బెటర్..
10 వారాల సమయంలో ఆటను, ఆటగాళ్లను అర్థం చేసుకోవడం అంటే అది భారత కెప్టెన్ల వల్లే అవుతుంది. మేం టోర్నీ ఆరంభంలో ఈ సీజన్‌లో అతి తక్కువ సిక్సర్లు కొట్టే జట్టుగా నిలవాలని ఫిక్స్ అయ్యాం...
ఎందుకంటే సిక్సర్లు కొట్టాలనే ఆతృతలో వికెట్లు పారేసుకోకూడదు. డాట్ బాల్స్ ఎక్కువ ఆడినా పర్లేదు, పరుగుల ప్రవాహం తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. మేం అనుకున్నది ఇదే, ఆచరించింది ఇదే...
బౌలింగ్ విషయాల్లోనూ ఇదే స్ట్రాటెజీ. పవర్ ప్లేలో, డెత్ ఓవర్లలో బెస్ట్ బౌలర్లను వాడి పరుగులను నియంత్రిస్తే చాలు, మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ చెప్పుకొచ్చాడు గుజరాత్ టైటాన్స్ మెంటర్ గ్యారీ కిర్‌స్టన్..