- Home
- Sports
- Cricket
- ఆడవాళ్లు క్రికెట్ ఆడకూడదు, నేను సనాకి అదే చెప్పా... వైరల్ అవుతున్న సౌరవ్ గంగూలీ పాత కామెంట్లు...
ఆడవాళ్లు క్రికెట్ ఆడకూడదు, నేను సనాకి అదే చెప్పా... వైరల్ అవుతున్న సౌరవ్ గంగూలీ పాత కామెంట్లు...
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై నానా రచ్చ నడుస్తూనే ఉంది. విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో చేసిన కామెంట్లు, బీసీసీఐపై అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై తీవ్రమైన ట్రోలింగ్ రావడానికి కారణమవుతున్నాయి..

సౌరవ్ గంగూలీని దూషిస్తూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, దాదా ఇంతకుముందు చేసిన చిన్నచిన్న పొరపాట్లను, తప్పిదాలను ఎత్తి చూపిస్తున్నారు...
తాజాగా అమ్మాయిలు, క్రికెట్ ఆడకూడదంటూ సౌరవ్ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో చేసిన పాత కామెంట్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...
‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌తో పాటు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్, అన్వయ్ ద్రావిడ్ కూడా తండ్రి బాటలో క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు...
అయితే సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ మాత్రం క్రికెట్ ఆడలేదు, క్రికెట్ గ్రౌండ్‌లోనూ ఎప్పుడూ కనిపించింది లేదు.
కూతురు సనా గంగూలీని సోషల్ మీడియాకి, క్రికెట్ ప్రపంచానికి, రాజకీయాలకు దూరంగా పెంచుకున్నాడు సౌరవ్ గంగూలీ...
దాదాపు మూడేళ్ల క్రితం సౌరవ్ గంగూలీ ఓ బెంగాళీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేనెప్పుడూ సనాని ఈ విషయం అడగలేదు, అడగను కూడా ఎందుకంటే అమ్మాయిలు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు...
అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి పనికి రారంటూ సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లు, అప్పట్లో పెద్దగా సంచలనం క్రియేట్ చేయకపోయినా, ఇప్పుడు విరాట్ ఫ్యాన్స్ కారణంగా తెగ వైరల్ అవుతున్నాయి...
భారత మహిళా జట్టు, టీమిండియా పురుషుల జట్టుతో సమానంగా రాణిస్తూ ప్రపంచక్రికెట్‌లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే దిశగా దూసుకుపోతోంది...
ఇప్పటికే వుమెన్ ఐపీఎల్ కోసం భారత మహిళా క్రికెటర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిథాలీరాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జులన్ గోస్వామి, షెఫాలీ వర్మ వంటి క్రికెటర్లు అదరగొడుతున్న సమయంలో గంగూలీ ఇలాంటి కామెంట్లు చేయడం... క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి...