జోస్ బట్లర్ మంచి కెప్టెనే! కానీ వరల్డ్ కప్ గెలవాలంటే మంచి టీమ్ కూడా కావాలి... - గౌతమ్ గంభీర్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని టైటిల్ ఫెవరెట్‌గా మొదలెట్టింది ఇంగ్లాండ్. అయితే మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్... సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు తప్పుకుంది. మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచినా ఇంగ్లాండ్ సెమీస్ చేరడం కష్టమే..
అవకాశం దొరికినప్పుడల్లా 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో మహేంద్ర సింగ్ ధోనీకి దక్కిన క్రెడిట్‌ని ట్రోల్ చేసే గౌతమ్ గంభీర్.. ఈ ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ టీమ్ ఫెయిల్యూర్‌ని కూడా అందుకు వాడుకున్నాడు..
‘వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచులు చూస్తున్నవారందరికీ నా నుంచి ఒకే ప్రశ్న.. కెప్టెన్ ఒక్కడే వరల్డ్ కప్ గెలిస్తే, ఇంగ్లండ్ ఎందుకని ఫెయిల్ అవుతోంది. 2022 టీ20 వరల్డ్ కప్‌లో జోస్ బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టీమ్ టైటిల్ గెలిచింది.
Jos Buttler
మరి ఈ ప్రపంచ కప్‌లో ఎందుకని జోస్ బట్లర్, ఇంగ్లాండ్‌ని గెలిపించలేకపోతున్నాడు. ఎందుకంటే అతనొక్కడే ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవలేడు? ఎందుకంటే ఓ టీమ్ ప్రపంచ కప్ గెలవాలంటే అతని టీమ్‌లోని బ్యాటర్లు పరుగులు చేయాలి. బౌలర్లు వికెట్లు తీయాలి.
వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ మాత్రం కెప్టెన్ ఒక్కడికే పోతుంది. మరి టీమ్‌లో మిగిలిన 14 మంది ఏం పాపం చేసినట్టు. కెప్టెన్ ఒక్కడే ప్రపంచ కప్ గెలిచేటట్టు అయితే జోస్ బట్లర్ దాన్ని చేసి చూపించగలడు. కానీ అలా ఎప్పటికీ జరగదు...
Naveen Ul Haq Clean Bowled Jos Buttler
గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో జోస్ బట్లర్‌కి మంచి టీమ్ దొరికింది. ఈసారి అలా జరగలేదు. టీమ్ కాంబినేషన్ విషయంలో ఎక్కడో తేడా జరిగింది. టీమ్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం..’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
కెప్టెన్ ఒక్కడికే క్రెడిట్ దక్కడం గురించి గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్లు, 2011 వన్డే వరల్డ్ కప్‌లో మాహీకి క్రెడిట్ ఇవ్వడం గురించేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Dhoni-Kohli-Gambhir
జోస్ బట్లర్ టీమ్ ఫెయిల్యూర్‌ని కూడా మాహీని, అతని ఫ్యాన్స్‌ని ట్రోల్ చేయడానికి గంభీర వాడుకుంటున్నారని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..