ఇషాంత్ శర్మను ఎందుకు తీసుకున్నారు... కుల్దీప్‌ను ఎందుకు పక్కనబెట్టారు... గంభీర్ కామెంట్...

First Published Feb 5, 2021, 1:54 PM IST

ఆస్ట్రేలియా టూర్‌లో మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్‌కి మొదటి టెస్టులో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అలాగే ఆసీస్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు కల్పించాల్సిందని, అతని బదులు ఏ ప్లేయర్‌ని పక్కనబెట్టినా బాగుండేదని కామెంట్ చేశాడు గౌతీ.