2020లో మరో వింత... విరాట్ కోహ్లీని పొగిడిన గౌతమ్ గంభీర్... ‘హ్యాట్సాఫ్ అంటూ’...

First Published Dec 4, 2020, 8:05 PM IST

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌కి మధ్య ఉన్న గొడవల గురించి అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీని ఛాన్స్ వచ్చినప్పుడల్లా తిడుతూ, విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ ఉంటాడు గౌతమ్ గంభీర్. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్కమణ తర్వాత విరాట్ కెప్టెన్సీ తీసేయాలని, టీ20 కెప్టెన్సీ రోహిత్‌కి అప్పగించాలని ఎన్నో మాటలన్న గంభీర్... చాలారోజుల తర్వాత కోహ్లీని ప్రశంసించాడు.

ఆసీస్ పర్యటనను ఓటములతో ప్రారంభించింది టీమిండియా. మొదటి రెండు వన్డేల్లో ఓడి, వన్డే సిరీస్ కోల్పోయింది...

వన్డే సిరీస్‌లో ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఏంటో అర్థం కావడం లేదంటూ విమర్శించాడు గౌతమ్ గంభీర్. ఎప్పుడు ఏ బౌలర్‌ను వాడాలో కూడా తెలియని కెప్టెన్‌ను ఇప్పుడే చూస్తున్నానంటూ ఏకీపారేశాడు...

విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అంటూ భారత సారథి కెప్టెన్సీని విమర్శించిన గౌతమ్ గంభీర్... చాలా రోజుల తర్వాత విరాట్‌ను ప్రశంసించాడు...

మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ... వన్డేల్లో 12 వేల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

సచిన్ టెండూల్కర్ ఈ మైలురాయి అందుకోవడానికి 300 ఇన్నింగ్స్‌లు వాడుకుంటే, విరాట్ కోహ్లీ కేవలం 242 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు... ఈ రికార్డుపై స్పందించాడు గౌతమ్ గంభీర్.

‘నువ్వు దేన్నైనా గట్టిగా అనుకుంటే, దాన్ని పొందగలవు. ఏదైనా చేయగలవు. జట్టు గెలుపు కోసం అవసరమైన పరుగులు చేసి... హోటెల్‌కి తిరిగొస్తే దేశం కోసం ఏదో చేశామనే అనుభూతి పొందుతాం...

ఓ క్రికెటర్‌కి అదో గొప్ప అనుభూతి. విరాట్ కోహ్లీ సాధించిన వేల పరుగుల, అద్భుత సెంచరీలకు హ్యాట్సాఫ్...’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు గౌతమ్ గంభీర్.

కోహ్లీ కెరీర్ ఆరంభంలో విరాట్‌ను బాగా ఎంకరేజ్ చేశాడు జట్టులో సీనియర్ ఓపెనర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్. అయితే ఐపీఎల్‌లో జరిగిన ఓ వివాదం ఇద్దరి మధ్య వైరం పెంచేసింది.

2009లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. గౌతమ్ గంభీర్ 150 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 107 పరుగులు చేశాడు. కోహ్లీ మొదటి వన్డే సెంచరీ ఇదే.

ఈ ఇద్దరి భాగస్వామ్యంలో 315 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో గంభీర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికైతే, దాన్ని కోహ్లీతో పంచుకున్నాడు.

అయితే  2013లో కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవైంది. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత గంభీర్ ఏదో అనడం, ఇద్దరి మధ్య మాటామాటి పెరిగి మైదానంలోనే కొట్టుకోవడానికి ముందుకు రావడం తీవ్ర దుమారం రేగింది. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది.

భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. ‘నాకు తెలిసి ఓ క్రికెటర్‌ ఇంతలా పరుగులు చేయడం ఇప్పుడే చూస్తున్నా... కోహ్లీ మన ఇండియా ప్లేయర్ కావడం గర్వకారణం. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటిదాకా అతని వేగం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎక్కడా ఎనర్జీ డ్రాప్ కాకుండా ఆడుతున్నాడు. అతను ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతాడు...

విరాట్ కోహ్లీ చేసిన 43 వన్డే సెంచరీల్లో 26 శతకాలు ఛేధనలో రావడం మరీ గొప్ప విషయం’ అంటూ చెప్పుకొచ్చాడు వీవీఎస్ లక్ష్మణ్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?