బిసిసిఐలో "దాదా" గిరి: గంగూలీతో వైరం, రవిశాస్త్రికి చిక్కులే
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇక లాంఛనమే. బిసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలైంది. బ్రిజేష్ పటేల్ పోటీ పడినప్పటికీ చర్చల ద్వారా, రాయబారాల ద్వారా గంగూలీ ఏకగ్రీవమయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎదుర్కునే సవాళ్లు, ఆయన చేపట్టే సంస్కరణలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇక లాంఛనమే. బిసీసీఐ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలైంది. బ్రిజేష్ పటేల్ పోటీ పడినప్పటికీ చర్చల ద్వారా, రాయబారాల ద్వారా గంగూలీ ఏకగ్రీవమయ్యే విధంగా చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో బిసిసిఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎదుర్కునే సవాళ్లు, ఆయన చేపట్టే సంస్కరణలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది.
గంగూలీ బిసిసిఐ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తరుణంలో నెటిజన్లు మరో విధమైన చర్చను ముందుకు తెచ్చారు. టీమీడియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి, గంగూలీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితి ఉంది. గంగూలీని ముద్గుగా దాదా అని పిలుచుకుంటారు. అయితే, ఆ దాదాగిరి రవిశాస్త్రి మీద ప్రయోగిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
గంగూలీతో కయ్యానికి కాలు దువ్వింది నిజానికి రవిశాస్త్రియే. 2016లో టీమిండియా కోచ్ పదవికి తనను ఎంపిక చేయకపోవడానికి గంగూలీనే ప్రధాన కారణనని రవిశాస్త్రి పలుమార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేశారు. రవిశాస్త్రి విమర్శలపై గంగూలీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, రవిశాస్త్రిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం గంగూలీకి వచ్చిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బిసిసిఐ అధ్యక్ష పదవిని గంగూలీ చేపట్టిన తర్వాత రవిశాస్త్రి పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రవిశాస్త్రి ఫ్నీ మీమ్స్ ను రూపొందించి నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
టీమిండియా కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ 2016లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సిఎసీ)ని ఏర్పాటు చేసింది. కోచ్ ఎంపిక కోసం సీఎసీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో రవిశాస్త్రి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
రవిశాస్త్రి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరు కావడాన్ని సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ స్వాగతించారు. అయితే, గంగూలీ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. కోచ్ పదవి అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, ఇంటర్వ్యూకు కూడా వచ్చే తీరిక లేని వ్యక్తి కోచ్ గా ఎలా పనికి వస్తాడని గంగూలీ అన్నాడు.
రవిశాస్త్రిని వ్యతిరేకిస్తూ అనిల్ కుంబ్లేను కోచ్ గా ఎంపిక చేయాలని పట్టుబట్టి సచిన్, లక్ష్మణ్ లను ఒప్పించాడు. దీంతో తనకు కోచ్ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి విమర్శించాడు. కుంబ్లే రాజీనామా తర్వాత రవిశాస్త్రిని టీమిండియా కోచ్ గా ఎంపిక చేశారు. అయితే, రవిశాస్త్రి ఎంపికపై ఈ సమయంలో కూడా గంగూలీ ఆసక్తి ప్రదర్శించలేదని అంటారు.
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నవారిలో రవిశాస్త్రి కన్నా మంచి అభ్యర్థి కనిపించకపోవడంతో గంగూలీ కూడా సమ్మతించాడు. అయితే, దాంతో వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్నారు. రవిశాస్త్రి, గంగూలీ మధ్య వివాదం కూడా ముగిసిందని అంటున్నారు. అయితే, నెటిజన్లు మాత్రం మరో విధంగా భావిస్తున్నారు.