ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే, ఈసారి వరల్డ్ కప్ న్యూజిలాండ్‌దే! పాంటింగ్, సెహ్వాగ్ నుంచి...
10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా, ఈసారి ఎలాగైనా వన్డే వరల్డ్ కప్ గెలవాలనే కసిగా ఉంది. మరోసారి ప్రపంచ కప్ కొట్టి, వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలని డిఫెండింగ్ ఇంగ్లాండ్, ఇంకోసారి వరల్డ్ కప్ గెలవాలని ఆస్ట్రేలియా ఆతృతపడుతున్నాయి..
మొట్టమొదటి ప్రపంచ కప్ కైవసం చేసుకోవాలని సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లు తహతహలాడుతుంటే, టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ ఉన్న పాకిస్తాన్ కూడా తామే తక్కువ తినలేదని నిరూపించుకోవాలని చూస్తోంది.
అయితే గత నాలుగు వన్డే వరల్డ్ కప్ ఎడిషన్లలో రిపీట్ అయిన ఓ సెంటిమెంట్, ఈసారి కూడా వర్కవుట్ అయితే... న్యూజిలాండ్ ప్రపంచ కప్ గెలిచేయడం ఖాయమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...
2007 వన్డే వరల్డ్ కప్‌లో అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్, ప్రపంచ కప్‌లో మొట్టమొదటి సెంచరీ బాదాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2007 ప్రపంచ కప్‌ని మొదలెట్టిన ఆస్ట్రేలియా, ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి నాలుగో టైటిల్ గెలిచేసింది..
superstitions of indian cricketers
2011 వన్డే వరల్డ్ కప్‌లో వీరేంద్ర సెహ్వాగ్, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 175 పరుగులు చేశాడు. 2011 ప్రపంచ కప్‌లో నమోదైన మొదటి సెంచరీ ఇదే. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టాడు. ఈ టోర్నీలో భారత జట్టు, ఫైనల్‌లో శ్రీలంకపై గెలిచి రెండో వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది..
Image credit: PTI
2015 వన్డే వరల్డ్ కప్‌లో ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్‌పై సెంచరీ చేశాడు. ఈ టోర్నీలో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ని ఓడించి.. ఐదోసారి ప్రపంచ కప్ గెలిచేసింది..
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో జో రూట్, పాకిస్తాన్‌పై సెంచరీ చేశాడు. అప్పటిదాకా క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందినా ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయిన ఇంగ్లాండ్ టీమ్, మొట్టమొదటి ప్రపంచ కప్ కైవసం చేసుకుంది...
New Zealand
అంటే 2007 వన్డే వరల్డ్ కప్ నుంచి ఏ టీమ్ నుంచి మొదటి సెంచరీ వస్తే, అదే టీమ్ ప్రపంచ కప్ గెలుస్తూ వచ్చింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే మొదటి సెంచరీ బాదాడు...
గత నాలుగు వన్డే వరల్డ్ కప్ ఎడిషన్లలో రిపీట్ అయిన సెంటిమెంట్, ఈసారి కూడా వర్కవుట్ అయితే... న్యూజిలాండ్ ఖాతాలో మొట్టమొదటి ప్రపంచ కప్ చేరడం ఖాయం. భారత ఉపఖండ పిచ్‌ల్లో మెరుగైన రికార్డు లేని కివీస్, గత రెండు ప్రపంచ కప్ టోర్నీల్లో రన్నరప్ కూడా.