- Home
- Sports
- Cricket
- 2019 వరల్డ్‌కప్ విషయంలో అంబటి రాయుడికి అన్యాయం చేశాం... నిజం ఒప్పుకున్న మాజీ సెలక్టర్...
2019 వరల్డ్‌కప్ విషయంలో అంబటి రాయుడికి అన్యాయం చేశాం... నిజం ఒప్పుకున్న మాజీ సెలక్టర్...
2019 వన్డే వరల్డ్‌కప్ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న అంబటిరాయుడిని భారత జట్టుకు ఎంపిక చేయకపోవడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. టీమిండియాను వెంటాడుతున్న నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న క్రికెటర్‌గా నిరూపించుకున్నా, అంబటిరాయుడికి వరల్డ్‌కప్ ఆడే అవకాశం రాలేదు. ఈ కారణంగానే అంబటిరాయుడు అర్ధాంతరంగా క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. దాదాపు ఈ విషయంపై స్పందించాడు మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ.

వరల్డ్‌కప్ జట్టులో తనకి చోటు దక్కకపోవడంతో ‘ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ గ్లాసెస్ కొనుక్కున్నా’ అంటూ సెలక్టర్ల తీరుపై వెటకారంగా స్పందించాడు తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.

ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఎంపికపై స్పందించిన అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్... ‘బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్... ఇలా మూడు కోణాల్లో విజయ్ శంకర్ టీమిండియాకు ఉపయోగపడతాడు’ అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌లా ‘త్రీడీ గ్లాసెస్ కామెంట్’ చేశాడు అంబటి.

ఓపెనర్ శిఖర్ ధావన్‌కి గాయం కావడంతో ఆ స్థానంలో తనకి పిలుపు వస్తుందని భావించాడు అంబటిరాయుడు. అయితే అతని ప్లేస్‌లో రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు...

నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో విజయ్ శంకర్‌కి కూడా గాయం కావడంతో తనకి పిలుపు వస్తుందని ఆశపడ్డాడు అంబటి రాయుడు. అయితే అప్పుడు కూడా అంబటిరాయుడికి మొండి చెయ్యి చూపిన సెలక్టర్లు, శంకర్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ని ఎంపిక చేశారు.

తనను కావాలనే దూరం పెడుతున్నారని మనస్థాపం చెందిన అంబటి రాయుడు... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్‌కి గురి చేశాడు.

ఆవేశంగా తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు అంబటి రాయుడు... అయితే ఆ తర్వాత అంబటి రాయుడికి మళ్లీ భారత జట్టులో అవకాశం దక్కలేదు...

‘టీమిండియాకు నాలుగో నెంబర్ బ్యాట్స్‌మెన్ సమస్య ఎప్పటినుంచో వెంటాడుతోంది. ఈ స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయడంలో సెలక్టర్లు ఫెయిల్ అయ్యారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడికి అన్యాయం జరిగింది. అతన్ని ఎంపిక చేయకపోవడం నిజంగా మా పొరపాటే...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అప్పటి సెలక్టర్ ప్యానల్‌లో సభ్యుడు దేవాంగ్ గాంధీ.

‘విజయ్ శంకర్, రిషబ్ పంత్ వంటి యువకులను ఎంపిక చేస్తే మంచి కాంబినేషన్ సెట్ అవుద్దని అనుకున్నాం... కానీ అక్కడ పొరపాటు జరిగింది. మేం కూడా మనషులమే కదా... ’ అంటూ రాయుడి ఎంపిక విషయంలో జరిగిన తప్పును అంగీకరించాడు దేవాంగ్ గాంధీ.

‘2019 వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడు ఉండి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేది. కానీ ఆ విషయం గుర్తించడానికి చాలా ఆలస్యం అయ్యింది.. ’ అన్నాడు దేవాంగ్ గాంధీ.

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. కనీసం 10 టెస్టులు కూడా ఆడిన అనుభవం లేని క్రికెటర్లను సెలక్టర్లుగా నియమిస్తే, జట్టు ఎంపిక ఇలాగే ఉంటుందని బహిరంగంగానే విమర్శించారు భజ్జీ, సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు.

గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా... సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్‌తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా ఘోరంగా విఫలమైంది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 240 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా 221 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

వరల్డ్‌కప్ ముందు ఆస్ట్రేలియాపై జరిగిన సిరీస్ ఆడిన అంబటి రాయుడు... ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడి అద్భుతంగా రాణించాడు... 12 మ్యాచుల్లో 359 పరుగులు చేసిన అంబటి రాయుడు... డుప్లిసిస్ తర్వాత సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.