పాకిస్తాన్‌కి రావాలంటే టీమిండియానే కాదు, ఫారిన్ కోచ్‌లు భయపడుతున్నారు... - వసీం అక్రమ్...
ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ ఆడే విధానం, చూసే విధానం రెండూ పూర్తిగా మారిపోయాయి. వన్డేలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయి, టీ20లకు విపరీతమైన క్రేజ్ రాగా... దేశం తరుపున ఆడడం కంటే ఫ్రాంఛైజీలకు ఆడడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు క్రికెటర్లు... ఐపీఎల్ తోడుగా పదుల సంఖ్యలో టీ20 లీగ్‌లు పుట్టుకొచ్చాయి...
ఓవైపు సౌతాఫ్రికా20 లీగ్ జరుగుతుంటే మరోవైపు ఇంటర్నేషనల్ లీగ్20 సందడి కూడా మొదలైపోయింది. మరోవైపు బిగ్ బాష్ లీగ్ కూడా జరుగుతోంది. ఒకేసారి మూడు టీ20 లీగ్స్ జరుగుతుండడంతో క్రికెటర్లు బిజీ బిజీగా గడిపేస్తున్నారు...
‘నాలుగు ఓవర్లు వేయడం వల్ల ఎక్కువ డబ్బులు వస్తుంటే, దేశవాళీ క్రికెట్‌లో ఆడడానికి ఎవ్వరూ ప్రాధాన్యం ఇవ్వరు. అయితే ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు. దేశవాళీ టోర్నీల్లో ఆడితేనే ఆటలో రాటుతేలే అవకాశం దొరుకుతుంది...
Wasim Akram
నసీం షా, హారీస్ రౌఫ్, వసీం జూనియర్ కచ్ఛితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలి. పాక్ సూపర్ లీగ్‌లో ఆడడం ఎంత ముఖ్యమో ఫస్ట్ క్లాస్ క్రికెట్ కూడా అంతే ముఖ్యం. సుదీర్ఘ ఫార్మాట్ ఆడడం వల్ల చాలా విలువైన అనుభవాన్ని సంపాదించొచ్చు...
ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎక్కువగా ఆడడం వల్లే నేను, ఇమ్రాన్ ఖాన్ వంటి ప్లేయర్లు ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడగలిగాం. ఓడిపోతామనే భయంపోతే గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. గెలిచినా, ఓడినా భయం ఉండకూడదు...
చాలామంది క్రికెటర్లు గ్రీన్ పిచ్‌ల మీద ఆడలేకపోతున్నారు. కాస్త బౌన్స్ ఎక్కువగా ఉంటే రెండు రోజులు కూడా మ్యాచులు సాగడం లేదు. టెస్టుల్లో పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోవడానికి ఇది కూడా ఓ కారణం...
పాక్‌లో ఆడడానికి వేరే దేశాల క్రికెటర్లు భయపడుతున్నారు. ఇండియా గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ పాక్‌కి ఫారిన్ కోచ్‌లు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే పాకిస్తాన్‌తో పాక్‌లో పనిచేయాలంటే ఫారిన్ కోచ్‌లు భయపడుతున్నారు...
Babar Azam
అందుకే పాక్ క్రికెట్ బోర్డు ఎంత ఇచ్చినా, మనతో కలిసి పనిచేయడానికి వాళ్లు సిద్ధంగా లేరు. అదీకాకుండా అంతా ఇంతా అని చెప్పుకోవడం తప్ప మన పర్ఫామెన్స్ గ్రాఫ్ చూస్తే, ఎలా దిగజారుతున్నామో అర్థం అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్..