- Home
- Sports
- Cricket
- కావాలనే ఓడిపోయారు! ఫైనల్‌లో ఫిక్సింగ్ జరిగింది.. పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కామెంట్లు...
కావాలనే ఓడిపోయారు! ఫైనల్‌లో ఫిక్సింగ్ జరిగింది.. పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ కామెంట్లు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ ఏ మ్యాచ్‌లోనూ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది లేదు. టీమిండియా, జింబాబ్వేలతో మ్యాచులు ఓడిపోయిన తర్వాత లక్కీగా సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్, బౌలర్ల కారణంగా ఫైనల్ దాకా వెళ్లగలిగింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓడింది పాక్. అయితే ఫైనల్‌లో పాకిస్తాన్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్...

Babar Azam
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగి, రన్నరప్‌గా నిలిచింది. అంతకుముందు జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది పాకిస్తాన్. పాక్ జట్టు ఆటతీరును తీవ్రంగా తప్పుబట్టాడు జావెద్ మియాందాద్..
Image credit: Getty
‘పాక్ జట్టులోని కొందరు ప్లేయర్లు కౌంటీ మ్యాచులు ఆడారు. అయితే టీ20 వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్ల భవిష్యత్తు మాటేంటి? వాళ్లను నా స్టూడియోకి తీసుకురండి. వాళ్లకి క్రికెట్ గురించి ఎంత తెలుసో మాట్లాడాలి... పాక్ క్రికెట్ బోర్డు, ఫారిన్ కోచ్‌లను ఎందుకు నియమిస్తోంది...
Babar Azam
ఫారిన్ కోచ్‌లు నియమిస్తే ఏ తప్పు జరిగినా వాళ్ల మీద తోసేయొచ్చు, ఓడిపోతే వాళ్లను నిందిస్తారు? గెలిస్తే క్రెడిట్ తీసుకోవచ్చు... పాక్ బోర్డులో ఉన్నవాళ్లు ఎవ్వరూ క్రికెట్ ఆడలేదా? మీకు ఎవ్వరికైనా వేరే బోర్డు నుంచి కోచ్ ఆఫర్లు వచ్చాయా?
నా గురించి చెప్పడం లేదు, నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. నేనే చేయడం ఇష్టం లేక వెళ్లలేదు. మరి ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల సంగతి ఏంటి? వాళ్లు విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా ఆడలేరు. అందుకే ఫిక్సింగ్‌కి పాల్పడ్డారు. టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ వారి కెరీర్ ముఖ్యం...
Pakistan Cricket
ఫిక్సింగ్ చేయకపోతే తమకి కెరీర్ ఉండదని భయపడి ఉంటారు. అందుకే ఇలా ఆడారు. లేకపోతే పాక్ టీమ్ ఎలా ఆడుతుందో ప్రపంచానికి తెలీదు. నిజనిజాలేంటో బయటపెట్టండి..’ అంటూ సీరియస్ అయ్యాడు పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్...
టీమిండియా, జింబాబ్వేతో జరిగిన మ్యాచుల్లో ఓడిన తర్వాత కూడా నెదర్లాండ్స్ ఇచ్చిన అదృష్టంతో సెమీస్ చేరిన పాకిస్తాన్, ఫైనల్ చేరడమే చాలా పెద్ద అఛీవ్‌మెంట్ అంటున్నారు అభిమానులు. ఫిక్సింగ్ చేయడం వల్లే ఫైనల్ దాకా వచ్చి ఉండొచ్చని ట్రోల్స్ కూడా చేస్తున్నారు...