MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ప్రేమలో పడ్డా, పెళ్లి మాత్రం చేసుకోకండి... అయేషా ముఖర్జీతో విడాకులపై ఓపెన్ అయిన శిఖర్ ధావన్...

ప్రేమలో పడ్డా, పెళ్లి మాత్రం చేసుకోకండి... అయేషా ముఖర్జీతో విడాకులపై ఓపెన్ అయిన శిఖర్ ధావన్...

గత రెండున్నరేళ్లు శిఖర్ ధావన్‌కి ఏ మాత్రం కలిసి రాలేదు. ఐపీఎల్‌లో బాగా ఆడుతున్నా టీ20ల్లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఆ తర్వాత వన్డే ఫార్మాట్‌కి దూరమయ్యాడు. అంతేకాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకుని వేరు పడ్డాడు గబ్బర్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 26 2023, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

తనకంటే వయసులో 10 ఏళ్లు పెద్దది, అప్పటికే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్న అయేషా ముఖర్జీని ఫేస్‌బుక్‌లో చూసిన శిఖర్ ధావన్... ఆమెను ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. అయేషాకి అప్పటికే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరూ వేరుపడ్డారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఎట్టకేలకు తన విడాకుల గురించి ఓపెన్ అయ్యాడు శిఖర్ ధావన్.. ‘పెళ్లి అనే పరీక్షలో నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే అది ఓ ఒక్క వ్యక్తి చేతుల్లో ఉండదు, రెండు వ్యక్తులు కలిసి రాయాల్సిన పరీక్ష. తను తప్పు చేసిందని అనను, అలాగని నాది తప్పని ఒప్పుకోను...

39

నాకు పెళ్లి అనే ఫీల్డ్ కొత్త. సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో తెలీదు. నేను 20 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఆ ఆట గురించి నాకు తెలుసు. ఆట గురించి చెప్పమంటే అనర్గళంగా చెబుతా... అది అనుభవంతో వచ్చింది...

49

విడాకుల గురించి చెప్పాలంటే ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, చాలా ఎక్కువ జాగ్రత్త పడతాను. ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో బుర్ర బద్ధలు కొట్టుకున్నా పర్లేదు, తొందర మాత్రం పడను..

59

నేను 26-27 ఏళ్ల వరకూ ఒంటరిగా ఉన్నా. ఎలాంటి రిలేషన్‌లోనూ లేను. బయటికి వెళ్లేవాడిని, స్నేహితులతో తిరిగేవాడిని. ఫుల్లుగా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఎవ్వరితో రిలేషన్‌ మాత్రం పెట్టుకోలేదు...

69

అయితే నేను ప్రేమలో పడిన తర్వాత నాకు అన్నీ మధురంగానే కనిపించాయి. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నవ్వుతూ చేసుకుంటూ పోయా. కానీ కళ్లకు అలుముకున్న ప్రేమ తెర తొలిగిపోతే అన్నీ ఇబ్బందిగానే అనిపిస్తాయి...
 

79

కుర్రాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. రిలేషన్‌లో ఉంటే, అన్నింటినీ  అనుభవించండి. కోపాలు, తాపాలు, బాధలు, బ్రేకప్స్ కూడా. అంతేకానీ ఎమోషనల్ అయిపోయి, పెళ్లి మాత్రం చేసుకోకండి. కొన్నేళ్ల పాటు కలిసి ఉండి, తన గురించి నీకు, నీ గురించి తనకు తెలిసిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి.. 

89

ఇది కూడా క్రికెట్ మ్యాచ్ లాంటిదే. కొందరికి సెటిల్ అవ్వడానికి నాలుగు ఐదు మ్యాచుల సమయం పడుతుంది. మరికొందరికి ఒక్క మ్యాచ్‌లోనే దొరకవచ్చు, ఇంకొందరికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు.. అయితే పెళ్లికి ముందు కాస్త అనుభవం మాత్రం చాలా ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్...

99

ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు శిఖర్ ధావన్. టీమిండియాలో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో అదరగొట్టి తన ప్లేస్‌ని తిరిగి సంపాదించుకోవాలని అనుకుంటున్నాడు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: తిలక్ వర్మ సహా ఇద్దరు స్టార్లకు బిగ్ షాక్.. టీమిండియాలో భారీ మార్పులు
Recommended image2
IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం.. భారత్ సిరీస్ కోల్పోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image3
Indian cricketers : కోహ్లీ ఒక్కడే కాదు, ఈ ఇండియన్ క్రికెటర్లు కూడా ఫారిన్ లో సెటిల్.. ఎవరు, ఏ దేశంలో ఉంటున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved