ఫైనల్ చేర్చలేనందుకు సిగ్గుపడుతున్నా... కానీ గర్వంగా కూడా ఉంది... కేన్ విలియంసన్!

First Published 9, Nov 2020, 4:37 PM

IPL 2020 సీజన్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్... పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన సన్‌రైజర్స్... ఢిల్లీ క్యాపిటల్స్ మొట్టమొదటిసారి ఐపీఎల్ ఫైనల్ చేరడానికి కారణమైంది. క్వాలిఫైయర్ 2లో దాదాపు సన్‌రైజర్స్‌ను గెలిపించినంత పనిచేసిన కేన్ విలియంసన్... మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

190 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది...

ప్రియమ్ గార్గ్, మనీశ్ పాండే, జాసన్ హోల్డర్ కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో 90 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

ఈ దశలో 45 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు కేన్ విలియంసన్...

కేన్ విలియంసన్ సిక్సర్లు బాదుతంటే... ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ల గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. అయితే కీలక సమయంలో కేన్ విలియంసన్ అవుట్ కావడంతో మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

190 పరుగుల చేధనలో 172 పరుగులకే పరిమితమై 19 పరుగుల తేడాతో ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కేన్ విలియంసన్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘ఢిల్లీ చాలా మంచి జట్టు. మేం చాలారోజులుగా వరుసగా విజయాలు సాధిస్తున్నాం, ఆ రిథమ్‌ను ఢిల్లీ నేడు అందుకుంది మొదటి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసి, సన్‌రైజర్స్‌ను ప్రెజర్‌లో నెట్టేసింది క్యాపిటల్స్...

టార్గెట్ ఎక్కువ కావడంతో మేం రిస్క్‌లు తీసుకోవాల్సి వచ్చింది. అవి వాళ్లకి కావాల్సిన వికెట్లను అందించాయి. మంచి ఆరంభం దక్కకపోయినా మధ్యలో మంచి భాగస్వామ్యం నెలకొల్పగలిగాం...

నేను, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్ అవుటయ్యేదాకా కూడా మ్యాచ్ గెలిచేందుకు మాకు అవకాశం ఉండింది. కానీ దాన్ని అందుకోలేకపోయాం. సన్‌రైజర్స్‌ను గెలిపించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా...

ఫైనల్ చేరలేకపోయినా ఇక్కడికా మా జర్నీ చాలా అద్భుతంగా సాగింది. అందుకు చాలా గర్విస్తున్నాం... ’ అన్నాడు కేన్ విలియంసన్.

యంగ్ ప్లేయర్ ప్రియమ్ గార్గ్‌కి ఎంతో టాలెంట్ ఉందని చెప్పిన కేన్ విలియంసన్... నెట్స్‌లో ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడని... అతను ఆడే కొన్ని షాట్స్ ఎంతో అందంగా ఉంటాయని చెప్పాడు కేన్ విలియంసన్.