MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: మునపటి ఫామ్ ఖాయం.. ఈసారి విరాట్ అభిమానులకు పండుగే.. కోహ్లీ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Virat Kohli: మునపటి ఫామ్ ఖాయం.. ఈసారి విరాట్ అభిమానులకు పండుగే.. కోహ్లీ చిన్ననాటి కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ind Vs SA: టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది.  దక్షిణాఫ్రికా పర్యటనలో అయినా విరాట్.. తిరిగి మునపటి ఫామ్ ను అందుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. 

2 Min read
Author : Srinivas M
| Updated : Dec 26 2021, 05:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం టీమిండియా ప్రస్తుతం అక్కడి సెంచూరియన్ లో తొలి టెస్టు ఆడుతున్నది. అయితే కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. ఈసారి  మాత్రం అదరగొడతాడని అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అంటున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

శర్మ మాట్లాడుతూ.. ‘సెంచూరియన్ లో గత పర్యటన (2018) లో విరాట్ కోహ్లీ చాలా భాగా ఆడాడు. ఈ సారి కూడా అదే ఆటను ఇక్కడ పునరావృతం చేస్తాడని నేను భావిస్తున్నాను. 

39

విరాట్ ఫ్యాన్స్ అందరూ అతడు తిరిగి పాత కోహ్లీలా మారిపోవాలని కోరుకుంటున్నారు.  అతడు పరిణితి సాధించిన ఆటగాడు. తప్పకుండా రాణిస్తాడు.. చాలాకాలంగా అతడు జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. 

49

టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శనలు చేయడానికి అతడెప్పుడూ వెనుకాడడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా విరాట్ అభిమానులు ఈసారి ఒకప్పటి కోహ్లీని చూస్తారని నేను విశ్వసిస్తున్నాను.. ’ అని చెప్పుకొచ్చాడు. 

59

కాగా.. 33 ఏండ్ల కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ చేయలేదు. దీంతో అతడి నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రెండేండ్ల కాలంలో  విరాట్ పలు టెస్టులాడినా హాఫ్ సెంచరీల వద్దే నిష్క్రమిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం వాటిని శతకాలుగా మార్చాలని  ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

69

గత పర్యటనలో ఇదే సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ.. 153 పరుగులు చేశాడు. కానీ ఆ టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

79

గత కొద్దికాలంగా ఒత్తిడి, వన్డే కెప్టెన్సీ తొలిగింపు, బీసీసీఐ,  డ్రెస్సింగ్ రూమ్ లో గ్రూపుల కారణంగా విరాట్ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మునపటి ఫామ్ అతడిలో కనిపించడం లేదని స్వయంగా అతడి ఫ్యాన్సే ఆరోపిస్తున్నారు. 

89

ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత  జట్టు నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు. 

99

40 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా  113 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్.. 118 బంతుల్లో 8 ఫోర్లు బాది 47 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. 121 బంతుల్లో 56 రన్స్  సాధించాడు. అతడు కూడా 8 ఫోర్లు కొట్టాడు. 

About the Author

SM
Srinivas M
భారత దేశం
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...
Recommended image2
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Recommended image3
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved