- Home
- Sports
- Cricket
- ఆ రెండు మ్యాచులు గెలిస్తే, వరల్డ్ కప్ మనదే... టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్..
ఆ రెండు మ్యాచులు గెలిస్తే, వరల్డ్ కప్ మనదే... టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా, వచ్చే నెల ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఆ తర్వాత ఆసియా కప్, ఏషియన్ గేమ్స్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలతో బిజీ బిజీగా గడపనుంది..

జస్ప్రిత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో టీమ్‌కి దూరంగా ఉండడంతో టీమిండియా, వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు... అయితే 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి..
అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి వరల్డ్ కప్ 2023 మ్యాచ్ ఆడే టీమిండియా, ఆ తర్వాత అక్టోబర్ 11న ఆఫ్ఘానిస్తాన్‌తో, అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది...
Rohit Sharma-Gavaskar
‘ఆస్ట్రేలియాకి పటిష్టమైన బౌలింగ్ యూనిట్ ఉంది. ఇండియాలో అయినా ఎక్కడైనా ఆసీస్‌పై గెలవడం అంత ఈజీ కాదు. అలాంటి బౌలింగ్ యూనిట్ ఉన్న టీమ్‌తో మొదటి మ్యాచ్ ఆడడం టీమిండియాకి చాలా మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే ఆస్ట్రేలియా గెలిస్తే, మిగిలిన టీమ్స్‌ని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు..
India vs Australia
ఆస్ట్రేలియాపై ఓడిపోతే, మిగిలిన టీమ్స్‌తో ఎలా ఆడాలో క్లారిటీ వస్తుంది. ప్రణాళికలు, వ్యూహాలు మార్చుకునేందుకు, పదును పెట్టుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. పాకిస్తాన్ టీమ్‌కి కూడా మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. మొదటి 3 మ్యాచుల్లో రెండు తప్పక గెలవాల్సిన మ్యాచులు ఆడుతోంది టీమిండియా...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లపై గెలిస్తే మిగిలిన టీమ్స్‌ని ఓడించడం టీమిండియాకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి టీమ్స్‌ని స్వదేశంలో ఓడించేందుకు ఏం చేయాలో భారత జట్టుకి బాగా తెలుసు...
బలమైన ప్రత్యర్థులను తొలుత ఎదుర్కొంటే, ఆ తర్వాత బలహీనమైన జట్లతోనే మ్యాచులు ఉంటాయి. వాటిని ఓడించడానికి ఏం చేయాలో, ఎలాంటి మార్జిన్‌తో గెలవాలో టీమిండియాకి తెలుస్తుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏ మాత్రం పనికి రాదు..
సెమీస్‌లో గెలిస్తే, అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ప్రత్యర్థి ఎవ్వరైనా ఓడించడం పెద్ద కష్టం కాదని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..