- Home
- Sports
- Cricket
- 10 సార్లు అవుట్ చేశాడు, ఇప్పుడు అతని కోచింగ్‌లోనే... బ్రెండన్ మెక్‌కల్లమ్, స్టువర్ట్ బ్రాడ్‌లకి...
10 సార్లు అవుట్ చేశాడు, ఇప్పుడు అతని కోచింగ్‌లోనే... బ్రెండన్ మెక్‌కల్లమ్, స్టువర్ట్ బ్రాడ్‌లకి...
ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త శకం మొదలైంది. వరుస పరాజయాలతో హెడ్ కోచ్ బాధ్యతల నుంచి క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేయడం, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్సీకి జో రూట్ రాజీనామా చేయడంతో కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్యతలు చేపట్టారు...

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా కెరీర్ మొదలెడుతున్నాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్...
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ హెడ్‌కోచ్‌గా, న్యూజిలాండ్‌లో పుట్టిన బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, న్యూజిలాండ్‌తోనే టెస్టు మ్యాచ్ ఆడుతోంది ఇంగ్లాండ్ జట్టు... ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ సీనియర్ పేస్ ద్వయం జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు...
ఇందులో స్టువర్ట్ బ్రాడ్‌కి బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై తిరుగులేని రికార్డు ఉంది. టెస్టుల్లో బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని 10 సార్లు అవుట్ చేసిన స్టువర్ట్ బ్రాడ్, అత్యధిక సార్లు అతన్ని పెవిలియన్ చేర్చిన బౌలర్‌గా ఉన్నాడు...
ముత్తయ్య మురళీధరన్ 9 సార్లు, మెక్‌కల్లమ్‌ని అవుట్ చేయగా, జేమ్స్ అండర్సన్, జహీర్ ఖాన్, రంగనా హేరాత్ బౌలింగ్‌లో 8 సార్లు అవుట్ అయ్యాడు ఈ కివీస్ మాజీ బ్యాట్స్‌మెన్...
ఇందులో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ ఇద్దరూ కూడా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రెండన్ మెక్‌కల్లమ్ కోచింగ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతుండడం విశేషం...
లార్డ్స్‌లోని కామెంటరీ బాక్సుకి దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ పేరు పెట్టింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇకపై లార్డ్స్ కామెంటరీ బాక్సుని ‘ది షేన్ వార్న్ కామెంటరీ బాక్సు’గా పిలుస్తామని ప్రకటించింది...
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇప్పటికే 13 టెస్టులు ఆడి ఒకే విజయంతో 7 మ్యాచుల్లో ఓడి 4 డ్రా చేసుకున్న ఇంగ్లాండ్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...