MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021: వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఎంట్రీ ఇవ్వనున్న ఇంగ్లండ్ కెప్టెన్.. ఈసారైనా ఫ్రాంచైజీలు కరుణించేనా..?

IPL2021: వచ్చే ఏడాది ఐపీఎల్ కు ఎంట్రీ ఇవ్వనున్న ఇంగ్లండ్ కెప్టెన్.. ఈసారైనా ఫ్రాంచైజీలు కరుణించేనా..?

Joe Root: బీసీసీఐ ఆధ్వర్యంలో  నడిచే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో ఆడాలని భారత్ లోనే గాక విదేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. ఏమీ లేని స్థితి నుంచి కోట్లకు పడగలెత్తిన ఆటగాళ్లెంతో మంది ఉన్నారు. అయితే డబ్బుల విషయం పక్కనపెడితే ఈ లీగ్ లో తమ సామర్థ్యం నిరూపించుకోవడానికి కూడా చాలా  మంది క్రికెటర్లు పోటీ పడుతుంటారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 14 2021, 01:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఐపీఎల్ (IPL) అంటేనే ధనాధన్ ఆట.  మూడు నాలుగు గంటల్లోనే ఫలితం తేలే ఈ  ధనాధన్ లీగ్ లో ఆడాలంటే టెస్టు ప్లేయర్లు పనికిరారనే ముద్ర పడిపోయింది. ఇందులో భాగంగానే  భారత్ టెస్టు ప్లేయర్ గా ముద్ర పడిపోయిన చతేశ్వర్ పూజారా, అజింక్యా రహానే లను  ఆడించడానికి ఏ ఐపీఎల్ జట్టూ ముందుకురాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కానీ తాజాగా  ఐపీఎల్ లో అడుగుపెట్టాలని ప్రపంచంలోనే నెంబర్ వన్ టెస్టు ప్లేయర్, ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ జో రూట్ తాపత్రయపడుతున్నాడు. వచ్చే ఏడాది వేలంలో పాల్గొనాలని అనుకుంటున్నాడు. 
 

38

ఆధునిక క్రికెట్ లో అద్భుత ఆటగాడిగా గుర్తింపు  పొందిన రూట్.. గతంలో ఐపీఎల్ లో ఆడాలని భావించాడు. కానీ వర్క్ లోడ్, ఇతరత్రా కారణాల వల్ల ఆడలేకపోయాడు. 

48

2018 ఐపీఎల్ సీజన్ లో ఆక్షన్ లో పాల్గొన్నా రూట్ ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతో అతడి ఐపీఎల్ ఆశలు అడియాసలయ్యాయి. కానీ ఈ ఇంగ్లండ్ కెప్టెన్ 2022 మెగా ఆక్షన్ లోకి రావాలని కోరుకుంటున్నట్టు ప్రముఖ ఇంగ్లండ్ పత్రిక డైయిలీ టెలిగ్రాఫ్ ఓ కథనం ప్రచురించింది. 

58

2018లో ఆక్షన్ లో పాల్గొన్నా తనను ఎవర తీసుకోకపోవడంతో నిరాశ చెందిన రూట్.. తాజాగా మరో రెండు కొత్త జట్లు చేరుతుండటంతో అవైనా  అతడిని తీసుకుంటాయని ఆశాభావంతో  ఉన్నాడు. 

68

దీనిపై రూట్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఏదో ఒక సమయంలో నేను ఐపీఎల్ సీజన్ లో భాగం కావాలని అనుకుంటున్నాను. ఐపీఎల్ లో ఆడటం నాకు చాలా ఇష్టం. వేలంలో ప్రవేశించడానికి ఇదే సరైన సమయం’ అని అన్నాడు. 

78

30 ఏళ్ల రూట్ చివరిసారి 2019 లో ఇంగ్లండ్ తరఫున ఆడాడు. కానీ త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో రూట్ కు చోటు దక్కలేదు. కానీ త్వరలో ఆస్ట్రేలియా తో జరిగే యాషెస్ టెస్టు సిరీస్ కు  అతడే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. 

88

టీ20 ఫార్మాట్ లో రూట్ బ్యాటింగ్ సగటు 35.7 గా ఉంది. టెస్టు క్రికెట్ కారణంగా అతడు పొట్టి క్రికెట్ లో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు బ్యాట్స్మెన్ ర్యాంకింగుల్లో నెంబర్ వన్ పొజిషన్ రూట్ దే కావడం గమనార్హం. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Siraj: ఓవల్ హీరో నుంచి రిజర్వ్ బెంచ్ వరకు.. మహమ్మద్ సిరాజ్‌కు ఏమైంది?
Recommended image2
Most Sixes Record: బాదుడే బాదుడు.. ఒక్క ఏడాదలోనే 100 సిక్సర్లు బాదిన బ్యాటర్లు వీరే
Recommended image3
IND vs WI: భారత జట్టు ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే.. ఈ తప్పులే కొంపముంచాయి !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved