- Home
- Sports
- Cricket
- శ్రేయాస్ అయ్యర్ వీక్‌నెస్ బయటపెట్టిన ఇంగ్లాండ్ కోచ్... డగౌట్‌లో కూర్చొని బెన్ స్టోక్స్‌కి సైగలు...
శ్రేయాస్ అయ్యర్ వీక్‌నెస్ బయటపెట్టిన ఇంగ్లాండ్ కోచ్... డగౌట్‌లో కూర్చొని బెన్ స్టోక్స్‌కి సైగలు...
ఏడాదిన్నరగా సరైన ఫామ్‌లో లేని టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింకా రహానే స్థానంలో టెస్టు టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉన్న శ్రేయాస్ అయ్యర్, ఆరంగ్రేటం టెస్టులోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. అయితే ఆ తర్వాత అతని నుంచి ఆశించిన పర్పామెన్స్ అయితే రావడం లేదు...

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 11 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అవుటైన శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో మ్యాటీ పాట్స్ ట్రాప్‌లో పడ్డాడు...
అయితే శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ టెస్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్, డగౌట్‌లో కూర్చొని ఇంగ్లాండ్ టీమ్‌కి సైగలు చేయడం కనిపించింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్‌కి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించగా, బ్రెండన్ మెక్‌కల్లమ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు...
ఐపీఎల్‌లో షార్ట్ బాల్స్‌ని ఫేస్ చేయడానికి తెగ ఇబ్బందిపడ్డాడు శ్రేయాస్ అయ్యర్. ఈ విషయాన్ని అప్పుడు డగౌట్‌లో కూర్చొని బాగా గమనించిన బ్రెండన్ మెక్‌కల్లమ్... ఇప్పుడు బెన్ స్టోక్స్ అండ్ టీమ్‌కి షార్ట్ బాల్స్ వేయాల్సిందిగా సైగలతో సూచించాడు...
భుజాల పైకి బాల్ వేస్తే శ్రేయాస్ అయ్యర్ ఆడలేడని, ఈజీగా క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడని బ్రెండన్ మెక్‌కల్లమ్ సూచించడం... అతను చెప్పినట్టుగానే అంతకుముందు రెండు బౌండరీలతో ఊపుమీదున్న అయ్యర్... షార్ట్ బాల్‌కి షాట్ ఆడబోయి జేమ్స్ అండర్సన్‌కి క్యాచ్ ఇవ్వడం జరిగిపోయాయి..
Shreyas Iyer
కెరీర్‌లో ఐదో టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్, ఇప్పటిదాకా 46.89 సగటుతో 422 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో శ్రేయాస్ అయ్యర్ నుంచి టీమిండియా ఆశించిన పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు ఈ కేకేఆర్ కెప్టెన్...
Shreyas Iyer
అయితే తొలి ఇన్నింగ్స్‌లో 100వ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, రెండో ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులతో ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 5 వేల పరుగులను అందుకున్నాడు. ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసి, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, ఐపీఎల్ 2021 సీజన్‌లో షార్ట్ బాల్స్‌ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు...
అతని వీక్‌నెస్‌ని పసిగట్టిన ప్రత్యర్థి బౌలర్లు, రైనాని స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చారు. ఈ పర్ఫామెన్స్ కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్‌లో చోటు కోల్పోయిన సురేష్ రైనా, 2022 సీజన్ మెగా వేలంలో కూడా అమ్ముడుపోలేదు...
శ్రేయాస్ అయ్యర్ కూడా తనకి ఉన్న షార్ట్ బాల్ బౌన్సర్ వీక్‌నెస్‌ని సరిదిద్దుకోకపోతే సురేష్ రైనాకి పట్టిన పరిస్థితినే ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...