- Home
- Sports
- Cricket
- టీమిండియాపై ఆ రూల్‌ను పక్కనబెట్టి ఆడతాం... ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కామెంట్...
టీమిండియాపై ఆ రూల్‌ను పక్కనబెట్టి ఆడతాం... ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ కామెంట్...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ 2021-23 సీజన్‌లో ఇంగ్లాండ్, ఇండియా తమ మొదటి సిరీస్‌ను ఆగస్టు ప్రారంభంలో ఆడనున్నాయి. ఈ టెస్టు సిరీస్‌ను సీరియస్‌గా తీసుకోబోతున్నట్టు ప్రకటించాడు ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ జో రూట్...

కొన్నేళ్లుగా ఇంగ్లాండ్ టీమ్ టెస్టు ఫార్మాట్‌లో ‘రొటేషన్’ పాలసీని అనుసరిస్తోంది. ఈ పాలసీ కారణంగానే బెస్ట్ ప్లేయర్లను పక్కనబెట్టి, పెద్దగా అనుభవం లేని ప్లేయర్లను ఆడించాల్సిన పరిస్థితి...

న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ, ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ రొటేషన్ పాలసీ కారణంగానే ఓటమిపాలైంది ఇంగ్లాండ్ జట్టు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అయినా బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, బెయిర్ స్టో, ఆర్చర్ వంటి స్టార్లు లేకుండానే బరిలో దిగింది ఇంగ్లాండ్..

సీనియర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లతో పాటు మార్క్ వుడ్, డామ్ బేస్ వంటి ప్లేయర్లకు కూడా రొటేషన్ పాలసీ కారణంగా వరుస అవకాశాలు దక్కడం లేదు. టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఐదుకు పైగా వికెట్లు తీసిన డామ్ బేస్‌కి నాలుగో టెస్టులో కానీ అవకాశం రాలేదు..

యాషెస్ సిరీస్‌కి కీలక ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండేందుకు, ప్లేయర్లపై భారం పడకుండా చూసేందుకు ఈ రొటేషన్ పాలసీని అమలులోకి తెచ్చింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అయితే దీని వల్ల ఇంగ్లాండ్ జట్టుకి నష్టమే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన టీమిండియా టెస్టు సిరీస్‌లో రొటేషన్ పాలసీ అనుసరించి, భారీ మూల్యం చెల్లించుకుంది ఇంగ్లాండ్ జట్టు.

దీంతో ఇంగ్లాండ్‌లో జరిగే ఐదు టెస్టు సిరీస్‌కి మాత్రం ప్రతీకారాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది జో రూట్ టీమ్... రొటేషన్ పాలసీని పక్కనబెట్టి ఫిట్‌గా ఉన్న బెస్ట్ ప్లేయర్లందరినీ ఆడించాలని చూస్తోంది ఇంగ్లాండ్ జట్టు....

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినా భారత జట్టు చాలా బలమైన జట్టు. యాషెస్ సిరీస్‌కి ముందు జరిగే ఈ టెస్టు సిరీస్ గెలవడం మాకు చాలా అవసరం. అందుకే ఈ టెస్టు సిరీస్‌కి రొటేషన్ పాలసీని పక్కనబెట్టాలని భావిస్తున్నాం.

ఇప్పటికే చాలా రోజులుగా ఈ పాలసీ ఫాలో అవుతున్నాం. ఇక అవసరం లేదనుకుంటా. ఫిట్‌గా ఉన్న బెస్ట్ ప్లేయర్లను టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ఆడిస్తాం... ఈ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీని పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించాలంటే ఈ టెస్టు సిరీస్ గెలవడం కూడా చాలా ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్.

గాయం కారణంగా ఇండియాతో వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొనని జో రూట్, రెండు నెలల తర్వాత జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే గాయం తిరగబెట్టడంతో మళ్లీ విశ్రాంతి తీసుకున్నాడు...

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బరిలో దిగని జోఫ్రా ఆర్చర్, టీమిండియాతో జరిగే టెస్టు సిరీస్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత పాక్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడుతుంది.

ఆ తర్వాత జో రూట్ కెప్టెన్సీలో ఆగస్టు 4 నుంచి టీమిండియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆరంభం అవుతుంది.