MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • బజ్ బాల్ అంటిరి! టెస్టు క్రికెట్‌ని మారుస్తాం అంటిరి... సౌతాఫ్రికా చేతుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌పై...

బజ్ బాల్ అంటిరి! టెస్టు క్రికెట్‌ని మారుస్తాం అంటిరి... సౌతాఫ్రికా చేతుల్లో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్‌పై...

బజ్ బాల్... బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లాండ్ టెస్టు టీమ్‌కి హెడ్ కోచ్‌గా ఎంపికైన తర్వాత తీసుకొచ్చిన కాన్సెప్ట్. దూకుడే మంత్రంగా, బాదుడే లక్ష్యంగా తీసుకొచ్చే ఈ కాన్సెప్ట్, ఇంగ్లాండ్‌కి వరుస విజయాలు అందించింది... అయితే సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఈ బజ్ బాల్ మంత్రం పని చేయలేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 20 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గత ఏడాది నుంచి వరుస పరాజయాలు ఎదుర్కోవడం, యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఓడడం, వెస్టిండీస్‌ టూర్‌లో పరాజయాలతో జో రూట్‌ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌, ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
England Cricket Team

England Cricket Team

వరుస పరాజయాలతో క్రిస్ సిల్వర్‌వుడ్‌ని హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించిన ఇంగ్లాండ్, ఆ స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని టెస్టులకు హెడ్ కోచ్‌గా నియమించింది. బెన్ స్టోక్స్- బ్రెండన్ మెక్‌కల్లమ్ కలిసి ఇంగ్లాండ్ ఆటతీరును పూర్తిగా మార్చేశారు...

38

న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లో విజయం అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాని నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఓడించి సిరీస్‌ని 2-2 తేడాతో డ్రా చేసుకోగలిగింది. టీమిండియా విధించిన 370+ టార్గెట్‌ను ఇంగ్లాండ్ ఛేదించిన విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

48

అయితే సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో మాత్రం ఇంగ్లాండ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు మాత్రమే ఆడి 165 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్, రెండో ఇన్నింగ్స్‌లో పట్టుమని 40 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది...

58

తొలి ఇన్నింగ్స్‌లో కగిసో రబాడా 5, అన్రీచ్ నోకియా 3, మార్కో జాన్సన్ 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును దెబ్బ తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్లందరూ ముకుమ్మడిగా రాణించారు. రబాడా, కేశవ్ మహరాజ్, మార్కో జాన్సన్‌లకు రెండేసి వికెట్లు దక్కగా అన్రీచ్ నోకియా మూడు వికెట్లు తీశాడు. లుంగి ఇంగిడి ఓ వికెట్ తీశాడు...

68

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేయడంతో ఇన్నింగ్స్ 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఇంగ్లాండ్. 53 ఇన్నింగ్స్‌ల్లో 250 టెస్టు వికెట్లు పూర్తి చేసుకున్నాడు కగిసో రబాడా. బీభత్సమైన ఫామ్‌లో ఉండి, సెంచరీల మోత మోగిస్తున్న జో రూట్.. తొలి ఇన్నింగ్స్‌లో 8, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే అవుట్ అయ్యాడు...

78

ఇంగ్లాండ్ ఆట చూసి సగటు క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ప్రత్యర్థి సౌతాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘తొలి ఇన్నింగ్స్ తర్వాత వాళ్లు కమ్‌బ్యాక్ ఇస్తారని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు చేసి మాకు ఛాలెంజ్ విసురుతారని భావించా. అయితే ఈ మ్యాచ్ త్వరగా ముగిసిపోయింది..’ అంటూ కామెంట్ చేశాడు డీన్ ఎల్గర్...

88
Image credit: Getty

Image credit: Getty

బజ్ బాల్ కాన్సెప్ట్‌తో టెస్టు క్రికెట్ ఆడే విధానాన్నే మార్చేస్తామని ప్రగల్భాలు పలికిన ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌పై ట్రోల్స్ వినిపిస్తున్నాయి... నాలుగంటే నాలుగు టెస్టులు గెలవగానే బజ్ బాల్ కాస్తా లూజ్ బాల్ అయిపోయిందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved